For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023: పంత్ దూరమైనా పవర్‌ఫుల్‌గానే ఢిల్లీ.. తుది జట్టు అంచనా ఇదే!

 IPL 2023: Delhi Capitals Strength, Weakness and Playing XI Prediction

IPL 2023: Delhi Capitals Strength, Weakness and Playing XI Prediction: ఐపీఎల్ చరిత్రలోనే ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఢిల్లీ క్యాపిటల్స్.. ఈ సారైన ఆ ముచ్చట తీర్చుకోవాలని పరితపిస్తోంది. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ డేర్ డేవిల్స్‌గా ఆశించిన ఫలితం సాధించలేక ఢీల్లీ క్యాపిటల్స్‌గా మారిన టీమ్.. వరుసగా ప్లే ఆఫ్స్ చేరడంతో పాటు ఐపీఎల్ 2021లో ఫైనల్ చేరి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. గతేడాది 14 మ్యాచ్‌ల్లో 7 మాత్రమే గెలిచి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. బ్యాటింగ్‌లో డెప్త్ లేకపోవడం ఆ జట్టు కొంపముంచింది. ఇక మినీ వేలానికి ముందే ట్రేడ్ విండో ద్వారా శార్దూల్ ఠాకూర్‌ను కేకేఆర్‌కు ఇచ్చి ఆల్‌‌రౌండర్ ఆమన్ ఖాన్‌ను తీసుకున్న ఢిల్లీ.. జట్టు బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేసింది.

మనీశ్ పాండే, రిలీ రోసౌ వంటి బ్యాటర్లను తీసుకున్న ఢిల్లీ.. జట్టును మరింత పటిష్టం చేసుకుంది. అయితే కెప్టెన్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడం ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బతీసింది. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన పంత్.. ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ డేవిడ్ వార్నర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడంతో పాటు అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించుకుంది. పంత్ దూరమైనా.. ఢిల్లీ లైనప్ పటిష్టంగా ఉంది. మరీ ఐపీఎల్ 2023 సీజన్‌లోనైనా ఢిల్లీ టైటిల్ గెలుస్తుందో లేదో చూడాలి.!

ఢిల్లీ క్యాపిటల్స్ బలాలు..
ఢిల్లీ క్యాపిటల్స్ అతిపెద్ద బలం.. విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉండటం. పృథ్వీ షా, మిచెల్ మార్ష్,రిలీ రోసౌ, సర్ఫరాజ్ ఖాన్, రోవ్‌మన్ పోవెల్‌తో ఢీల్లీ టాప్-5 చాలా బలంగా కనిపిస్తోంది. ఈ టాప్-5లో ఏ ముగ్గురు చెలరేగినా ప్రత్యర్థికి చుక్కలే. మిచెల్ మార్ష్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల భారత్ వేదికగా జరిగిన వన్డే సిరీస్‌లో దంచికొట్టాడు. పృథ్వీషా, సర్ఫరాజ్ ఖాన్.. దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపారు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఉవ్విళ్లురుతున్నారు. కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌కు ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉంది. అతను కూడా ఫామ్ అందుకుంటే ఢిల్లీకి తిరుగుండదు. గతేడాది రోవ్‌‌మన్ పొవెల్ తన సత్తా ఏంటో చూపించాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లతో స్పిన్ బౌలింగ్ కూడా బలంగా ఉంది. వీటన్నింటికి మించి రికీ పాంటింగ్ కోచ్‌గా ఉండటం ఆ జట్టు అతిపెద్ద బలం.

ఢిల్లీ క్యాపిటల్స్ బలహీనతలు..
కెప్టెన్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడి జట్టుకు దూరం కావడం ఢిల్లీ క్యాపిటల్స్ అతిపెద్ద బలహీనత. పంత్ గైర్హాజరీ టీమ్ కాంబినేషన్‌ను దెబ్బతీయనుంది. అతని స్థాయి ఆటగాడిని ఢిల్లీ ఇప్పటికీ భర్తీ చేయలేకపోయింది. ఓవర్‌సీస్ ఆటగాళ్ల ఎంపిక కూడా ఢిల్లీ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారనుంది. జట్టులో భారత స్టార్ పేసర్లు లేకపోవడం కూడా లోటే. విదేశీ పేసర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి.

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు(అంచనా)
డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, ఫిల్ సాల్ట్, సర్ఫరాజ్ ఖాన్, రోవ్‌మన్ పొవెల్, అక్షర్ పటేల్, అన్రిచ్ నోర్జే, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్

ఎక్స్-ఫ్యాక్టర్ ప్లేయర్- పృథ్వీ షా. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ప్రభావితం చేయగల ఆటగాడు పృథ్వీ షా. అతను బ్యాట్‌తో చెలరేగితే ఢిల్లీకి తిరుగుండదు.

ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి జట్టు:
రిషభ్ పంత్(కెప్టెన్), ఖలీల్ అహ్మద్, అమన్ హకీమ్ ఖాన్, యశ్ ధుల్, ప్రవీణ్ దుబే, సర్ఫ్‌రాజ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ముకేశ్ కుమార్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కమలేశ్ నాగర్‌కోటి, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జ్, విక్కీ ఓస్వాల్, మనీశ్ పాండే, రిపాల్ పటేల్, అక్షర్ పటేల్, రోవ్‌మన్ పొవెల్, రిలీ రోసౌ, చేతన్ సకారియా, ఫిల్ సాల్ట్, ఇషాంత్ శర్మ, పృథ్వీ షా, డేవిడ్ వార్నర్.

Story first published: Saturday, March 25, 2023, 15:42 [IST]
Other articles published on Mar 25, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+