Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: తప్పతాగి మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్!

న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ ఒకరు తప్పతాగి ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో విజయానంతరం ఢిల్లీ ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన పార్టీలో జట్టుకు చెందిన స్టార్ ప్లేయర్.. అక్కడికి వచ్చిన ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడని జట్టు వర్గాలు పేర్కొన్నాయి.

ఈ ఘటనతో షాక్‌కు గురైన ఫ్రాంచైజీ.. ఆటగాళ్లకు కఠిన ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఎంతపెద్ద గెస్ట్‌లు అయినా.. ఫ్రాంచైజీ అధికారుల అనుమతి తీసుకునే ఆటగాళ్ల రూమ్స్‌కు వెళ్లాలని నిబంధన తీసుకొచ్చింది.

IPL 2023: Delhi Capitals star misbehaves with woman at party

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కొన్ని నిబంధనలను ఆటగాళ్లకు పెట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఫ్రాంచైజీ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేందుకు ఈ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు సమాచారం.

రాత్రి 10 గంటల తర్వాత బయటి వ్యక్తులు ఎవరూ కూడా ఆటగాళ్ల గదుల్లోకి వెళ్లడానిక వీల్లేదు. ఎవరైనా ఫొటో ఐడెంటిఫికేషన్‌తో ఆటగాళ్లను కలవాలి. టీమ్ హోటల్‌ను విడిచి వెళ్లడానికి ప్రతీ ఆటగాడు ఫ్రాంచైజీ అదికారుల అనుమతి తీసుకోవాలి. ఆటగాళ్ల సతీమణులు, ప్రియురాళ్లకు అనుమతి ఉన్నా.. వారి ఖర్చులను ఆటగాళ్లే భరించాలి.

తమతో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు ఉండాలంటే ఫ్రాంచైజీ అధికారుల అనుమతి తీసుకోవాలి. ఆటగాళ్లంతా ఖచ్చితంగా ఫ్రాంచైజీ ఏర్పాటు చేసే కార్యక్రమాలకు హాజరవ్వాలి. నిబంధనలను ఉల్లంఘించిన ఆటగాళ్లపై కఠిన చర్యలు ఉంటాయి. చేసిన తప్పును బట్టి చర్యలు తీసుకోనున్నారు. కాంట్రాక్ట్‌ను కూడా రద్దు చేసుకోనున్నారు.

ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దారుణంగా విఫలమైంది. ఏడు మ్యాచ్‌ల్లో కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్ మినహా మరే ప్లేయర్ రాణించడం లేదు.

Story first published: Thursday, April 27, 2023, 13:46 [IST]
Other articles published on Apr 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+