IPL 2023: కేఎస్ భరత్‌తో పాటు ఆ ఇద్దరిని వదిలేయనున్న ఢిల్లీ క్యాపిటల్స్!

హైదరాబాద్: భారీ అంచనాలతో ఐపీఎల్ 2022 సీజన్ బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 14 మ్యాచ్‌లకు ఏడు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ముంబై ఇండియన్స్‌తో తప్పక గెలవాల్సిన ఆఖరి మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమిపాలైంది. సునాయసంగా గెలిచే మ్యాచ్‌ను అనవసర తప్పిదాలతో చేజార్చుకుంది. దాంతో ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరగా.. పంత్ సేన ఇంటిదారి పట్టింది. లీగ్ దశలో ఢిల్లీ జట్టును కరోనా వైరస్ ఇబ్బంది పెట్టింది. పలువురు ఆటగాళ్లు, కోచ్‌లు వైరస్ బారిన పడ్డారు. రిషభ్ పంత్ దారుణంగా విఫలమవ్వడం కూడా ఢిల్లీ విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ క్రమంలోనే వచ్చే సీజన్‌కు కొంత మంది ఆటగాళ్లను వదులుకోవాలని ఆ జట్టు భావిస్తోంది.

కేఎస్ భరత్..
తెలుగు తేజం కేఎస్ భరత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్.. ఐపీఎల్ 2022 మేగా వేలంలో రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. 2021 సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన భరత్‌ను బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఎంచుకుంది. దాంతో అతనికి ఈ సీజన్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే ఆ జట్టు ఓపెనర్ పృథ్వీ షా తీవ్ర అనారోగ్యంతో జట్టుకు దూరమవడంతో అతని స్థానంలో భరత్‌కు రెండు మ్యాచ్‌ల్లో అవకాశం ఇచ్చారు. కానీ అతను మాత్రం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. 2 మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమై 8 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ఢిల్లీక్యాపిటల్స్ అతన్ని వదిలేయాలనుకుంటుంది. రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ ఉండటంతో బ్యాకప్‌గా యువ వికెట్ కీపర్‌ను తీసుకోవాలనుకుంటుంది.

సర్ఫరాజ్ ఖాన్..
ఐపీఎల్ 2022 సీజన్ మేగా వేలం రూ.20 లక్షల కనీస ధరకు సర్ఫరాజ్ ఖాన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపే సర్ఫరాజ్.. ఐపీఎల్ మాత్రం ఒక్కటంటే ఒక్క ఇన్నింగ్స్ కూడా చెప్పుకోదగ్గది ఆడలేదు. డొమెస్టిక్ పెర్ఫామెన్స్‌తో తుది జట్టులోకి తీసుకున్న ఢిల్లీ అతనికి 6 మ్యాచ్‌ల్లో అవకాశం కల్పించింది. ఈ 6 మ్యాచ్‌ల్లో 5 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్.. ఓపెనర్‌గా 36 పరుగులతో రాణించాడు. ఓవరాల్‌గా 5 ఇన్నింగ్స్‌ల్లో 30.33 సగటుతో 91 పరుగులు చేశాడు. అయితే ఢిల్లీ జట్టులో అతన్ని ఏ స్థానంలో ఆడించాలనేదానిపై టీమ్ మేనేజ్‌మెంట్‌కు క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేయాలని ఆ జట్టు భావిస్తోంది.

ముస్తాఫిజుర్ రెహ్మాన్..
ఐపీఎల్‌లో మంచి రికార్డున్న ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఈ సీజన్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. వేలంలో రూ.2 కోట్లకు అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన ముస్తాఫిజుర్ 8 వికెట్లు మాత్రమే తీసాడు. ఓవర్‌కు 7.63 పరుగుల చొప్పున సమర్పించుకున్నాడు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ విధ్వంసంతో ముస్తాఫిజుర్ ఒకే ఓవర్‌లో 28 పరుగులు ఇచ్చుకున్నాడు. దాంతో అతన్ని జట్టు పక్కనపెట్టేసింది. ఇక ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా రూపంలో ఢిల్లీకి మంచి లెఫ్టార్మ్ పేసర్‌లు ఉన్నారు. ఈ క్రమంలోనే ముస్తాఫిజుర్‌ను ఆ జట్టు వదులుకోవాలనుకుంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications