IPL 2023: రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదం తర్వాత బలహీనంగా ఢిల్లీ క్యాపిటల్స్.. తుది జట్టు అంచనా ఇదే!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. తృటిలో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను చేజార్చుకుంది. 14 మ్యాచ్‌ల్లో 7 గెలిచి ఐదో స్థానంలో నిలిచింది. బ్యాటింగ్‌లో డెప్త్ లేకపోవడం ఆ జట్టు కొంపముంచింది. మినీ వేలానికి ముందే ట్రేడ్ విండో ద్వారా శార్దూల్ ఠాకూర్‌ను కేకేఆర్‌కు ఇచ్చి ఆల్‌రౌండర్ ఆమన్ ఖాన్‌ను తీసుకుంది. రూ. 19.45 కోట్లతో మినీ వేలంలో పాల్గొన్న ఢిల్లీ ఫ్రాంచైజీ.. బలహీనతలను అధిగమించలేకపోయింది.
స్టార్ ఆల్‌రౌండర్లను కొనుగోలు చేయడంలో విఫలమైంది. మనీశ్ పాండే, రిలీ రోసౌ వంటి బ్యాటర్లను తీసుకున్న ఢిల్లీ.. కామెరూన్ గ్రీన్ కోసం చివరి వరకు ప్రయత్నించింది. జాసన్ హోల్డర్ వంటి ఆల్‌రౌండర్ అందుబాటులో ఉన్న కొనుగోలు చేయలేదు. రూ.15 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 25 మందితో కూడిన జట్టును తీసుకుంది. అసలే బ్యాటింగ్ ఆల్‌రౌండర్లు లేక ఇబ్బంది పడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదం కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఘోర రోడ్డు ప్రమాదంలో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన పంత్.. ఐపీఎల్ 2023 సీజన్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. అదే జరిగితే ఢిల్లీ తీవ్రంగా నష్టపోనుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ తుది జట్టు అంచనాపై ఓ లుక్కెద్దాం.

ఓపెనర్లుగా పృథ్వీ షా, డేవిడ్ వార్నర్..
ఐపీఎల్‌లోనే అత్యంత ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీ ఏదైనా ఉందా? అంటే అది పృథ్వీ షా, డేవిడ్ వార్నర్‌లదే. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఈ ఇద్దరూ దుమ్మురేపారు. అసలు ఢిల్లీ గెలిచిన ఏడు మ్యాచ్‌లో ఈ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. షా 10 మ్యాచ్‌ల్లో 283 పరుగులు చేయగా.. వార్నర్ 12 ఇన్నింగ్స్‌ల్లో 432 పరుగులతో రాణించాడు. ఈ సారి కూడా ఢిల్లీకి ఈ ఇద్దరే కీలకం కానున్నారు.

మిచెల్ మార్ష్, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్..
మిడిల్ ఆర్డర్‌లో మిచెల్ మార్ష్, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్ ఆడే అవకాశం ఉంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఈ ముగ్గురు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. మిచెల్ మార్ష్, పంత్ ప్రస్తుత ఫామ్ పేలవంగానే ఉంది. మార్ష్ గాయాలతో బాధపడుతుండగా.. పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. సర్ఫరాజ్ దేశవాళీలో సత్తా చాటుతున్నా.. ఐపీఎల్‌లో ఒక్క మార్క్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. పంత్ దూరమైతే.. ఫిల్ సాల్ట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు టీమ్ కాంబినేషన్ మొత్తం దెబ్బతిననుంది. కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ను కొనసాగించినా.. పంత్ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం. ఫిల్ సాల్ట్ జట్టులోకి వస్తే మిచెల్ మార్ష్‌ను తప్పించి భారత ఆటగాడిని తీసుకోవాల్సి ఉంటుంది.

ఆల్‌రౌండర్స్ అక్షర్, రోవ్‌మన్ పోవెల్..
రోవ్‌మన్ పోవెల్ గత సీజన్‌లో దుమ్మురేపాడు. అసాధారణ ఆటతో ఇటీవలే వెస్టిండీస్ వైట్ బాల్ సారథ్య బాధ్యతలు అందుకున్న పోవెల్.. అప్‌కమింగ్ సీజన్‌లో ఢిల్లీకి కీలకం అవుతాడని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. లోయర్ మిడిలార్డర్‌లో సత్తా చాటుతాడనుకుంటుంది. అక్షర్ పటేల్ ఫామ్ ప్రస్తుతానికి అయితే బాలేదు. టీ20 ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్ సమయానికైనా అతను గాడిలో పడతాడో లేదో చూడాలి.

బౌలర్లుగా కుల్దీప్, నోర్జే, ఖలీల్, ముకేశ్ కుమార్..
ఐపీఎల్ 2022 సీజన్‌లో కుల్దీప్ యాదవ్ దుమ్మురేపాడు. 14 మ్యాచ్‌ల్లో 21 వికెట్లతో ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అప్‌కమింగ్ సీజన్‌లో కూడా అతనే కీలక పాత్ర పోషిస్తాడని ఢిల్లీ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. దేశవాళీ ప్లేయర్ ముకేశ్ కుమార్‌ను రూ.5.5 కోట్ల భారీ ధరకు తీసుకున్న ఢిల్లీ అతనిపై ఆశలు పెట్టుకుంది. రెడ్ బాల్ క్రికెట్‌లో దుమ్మురేపిన ముకేశ్ తన ఫస్ట్ ఐపీఎల్‌లో సత్తా చాటుతాడని భావిస్తోంది. ఖలీల్ అహ్మద్‌తో కలిసి జట్టుకు కావాల్సిన ఆరంభాన్నిస్తాడని ఆశిస్తోంది. ఈ ఇద్దరూ అన్రిచ్ నోర్జ్ సారథ్యంలో పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు(అంచనా)
డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్/మనీశ్ పాండే, రిషభ్ పంత్/ఫిల్ సాల్ట్, సర్ఫరాజ్ ఖాన్, రోవ్‌మన్ పొవెల్, అక్షర్ పటేల్, అన్రిచ్ నోర్జే, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్
ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి జట్టు:
రిషభ్ పంత్(కెప్టెన్), ఖలీల్ అహ్మద్, అమన్ హకీమ్ ఖాన్, యశ్ ధుల్, ప్రవీణ్ దుబే, సర్ఫ్‌రాజ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ముకేశ్ కుమార్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కమలేశ్ నాగర్‌కోటి, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జ్, విక్కీ ఓస్వాల్, మనీశ్ పాండే, రిపాల్ పటేల్, అక్షర్ పటేల్, రోవ్‌మన్ పొవెల్, రిలీ రోసౌ, చేతన్ సకారియా, ఫిల్ సాల్ట్, ఇషాంత్ శర్మ, పృథ్వీ షా, డేవిడ్ వార్నర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications