Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హరీ బ్రూక్‌కు అంత సీన్ లేదు.. హైదరాబాద్ తప్పు చేసింది: ఆసీస్ దిగ్గజం

IPL 2023: David Hussey feels SRH have probably overpaid for England batter Harry Brook

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఇంగ్లండ్ యువ ప్లేయర్ హరీ బ్రూక్‌‌ను రూ.13.25 కోట్ల భారీ ధరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో పోటీపడి మరీ ఈ ఇంగ్లండ్ ప్లేయర్‌ను దక్కించుకుంది. అయితే హరీ బ్రూక్‌ కోసం అంత ధర వెచ్చించడం ఘోర తప్పిదమని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ హస్సీ అన్నాడు. బ్రూక్‌ను హైదరాబాద్ ఎక్కువగా అంచనా వేసిందని, ఎయిడెన్ మార్‌క్రమ్‌తో సమామనమైన ఆటగాడి కోసం అంత ధర వెచ్చించాల్సిన అవసరం లేదన్నాడు.

తాజాగా ఓ చానెల్‌తో మాట్లాడిన డేవిడ్ హస్సీ.. ఐపీఎల్ 2023 మినీ వేలంపై స్పందించాడు. 'హైదరాబాద్‌ బ్రూక్‌పై ఎక్కువ మొత్తం వెచ్చించింది. అతడి కనీస ధరను చూసి నేనేం ఆశ్చర్యపోలేదు. కానీ ఐదెన్‌ మార్‌క్రమ్‌తో సమానమైన ఆటగాడి కోసం హైదరాబాద్‌ అంత వెచ్చించాల్సిన అవసరం లేదు'' అని వెల్లడించాడు. బ్రూక్‌ రూ.1.5 కోట్ల కనీస ధరతో వేలంలోకి రాగా.. రాజస్థాన్ రాయల్స్ వ్యూహాత్మకంగా పోటీపడి రేటును అమాంతం పెంచేసింది. రూ.13.2 కోట్లతోనే వేలంలోకి వచ్చిన రాజస్థాన్.. హరీ బ్రూక్ కోసం కావాలనే రూ.13 కోట్ల వరకు పోటీపడింది. సన్‌రైజర్స్‌ను దెబ్బతీయాలనే ఆలోచనతోనే ఇలా చేసింది.

బ్రూక్‌ తన స్ట్రోక్‌ ఆటతో అంతర్జాతీయంగా ప్రాముఖ్యత సంపాదించాడు. ఇటీవల పాకిస్థాన్‌తో ఆడిన టెస్టు సిరీస్‌లో బ్రూక్‌ 93.60 ఆవరేజ్‌తో 468 పరుగులు చేశాడు. వాటిలో మూడు సెంచరీలు, ఒకటి అర్ధసెంచరీ ఉన్నాయి. అతని వ్యక్తిగత స్కోరు 153 పరుగులు. తన అద్భుత ప్రదర్శనతో 'మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌'గా నిలిచాడు. ఇక బ్రూక్‌ తర్వాత హైదరాబాద్‌ ఎక్కువ మొత్తం మయాంక్‌ అగర్వాల్‌పై వెచ్చించింది. రూ.8.25 కోట్లతో అతడిని కొనుగోలు చేసింది. కెప్టెన్‌గా మయాంక్‌ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Story first published: Saturday, December 24, 2022, 20:49 [IST]
Other articles published on Dec 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+