హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ ప్లే ఆఫ్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ అర్హత సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన కీలక మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ధోనీ సేన 77 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో టేబుల్ రన్నరప్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. క్వాలిఫయర్-1కు కూడా అర్హత సాధించింది.
మే 24న గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై వేదికగా జరిగే క్వాలిఫయర్-1లో చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. సొంతమైదానంలో క్వాలిఫయర్ -1 జరగడం ధోనీసేకు కలిసొచ్చే అంశం. అయితే క్వాలిఫికేషన్ రౌండ్స్ ప్రవేశపెట్టిన 2011 సీజన్ నుంచి గత 13 ఏళ్లుగా ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో రన్నరప్‌గా నిలిచి జట్టు ఫైనల్ ఆడుతుంది. ఈ సెంటిమెంట్ రిపీట్ అయితే ధోనీ సేన కూడా ఫైనల్ చేరనుంది.

2011 సీజన్‌లో టేబుల్ రన్నరప్‌గా నిలిచిన చెన్నై ఫైనల్ చేరింది. 2012 సీజన్ కేకేఆర్, 2013 సీజన్‌లో ముంబై ఇండియన్స్, 2014 సీజన్‌లో కేకేఆర్, 2015 సీజన్‌లో ముంబై ఇండియన్స్, 2016 సీజన్‌లో ఆర్‌సీబీ, 2017 సీజన్‌లో రైజింగ్ పుణే, 2018, 19 సీజన్‌లో చెన్నై, 2020లో ఢిల్లీ క్యాపిటల్స్, 2021లో చెన్నై, 2022లో రాజస్థాన్ రాయల్స్ రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లాయి.
మరో విషయం ఏంటంటే టేబుల్ రన్నరప్‌గా నిలిచి ఫైనల్ చేరిన ప్రతీసారి చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్‌గా నిలిచింది. 2011, 2018, 2021 మూడు సీజన్లలో చెన్నై టైటిల్ ముద్దాడింది. కేకేఆర్(2012, 2014), ముంబై ఇండియన్స్(2013, 2015) కూడా టేబుల్ రన్నరప్‌గా ఫైనల్ చేరి టైటిల్ ముద్దాడాయి. ఈ సెంటిమెంట్ రీపిట్ అయితే మరోసారి ధోనీ సేన టైటిల్ అందుకోనుంది.
16 ఏళ్ల చరిత్ర కలిగిన ఐపీఎల్ సీజన్‌లో రెండేళ్ల పాటు నిషేధంతో దూరమైన చెన్నై సూపర్ కింగ్స్.. 14 సీజన్లలో 12 సార్లు ప్లే ఆఫ్స్ చేరింది. 2020, 2022 సీజన్లలోనే లీగ్ దశకే పరిమితమైంది.
అరంగేట్ర సీజన్ 2008లో రన్నరప్‌గా నిలిచిన ధోనీసేన.. 2009లో సెమీఫైనల్లో ఓడింది. 2010, 2011లో ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్‌కే.. 2011, 2012లో రన్నరప్‌గా, 2014లో ప్లే ఆఫ్స్‌లోనే వెనుదిరిగింది. 2015లో మరోసారి రన్నరప్‌గా నిలిచిన ఆ జట్టు.. 2018లో టైటిల్ అందుకుంది. 2019లో మరోసారి రన్నరప్‌గా నిలిచిన సీఎస్‌కే 2021లో టైటిల్ ముద్దాడింది.