IPL 2023 ముందు.. రాబిన్ ఊతప్పతో పాటు ఆ ముగ్గురిని వదిలేయనున్న సీఎస్‌కే!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలమై తీవ్రంగా నిరాశ పరిచింది. 14 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలే సాధించిన సీఎస్‌కే.. పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చెన్నై.. ప్లే ఆఫ్స్ చేరకుండా నిష్క్రమించడం ఇది రెండోసారి. కెప్టెన్‌గా రవీంద్ర జడేజా దారుణంగా విఫలవమవడం.. స్టార్ పేసర్ దీపక్ చాహర్ గాయంతో సీజన్ మొత్తానికి దూరమవడం, స్టార్ ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం వంటి చెన్నై పతనాన్ని శాసించాయి.
టీమ్ కాంబినేషన్ కూడా సెట్ అవ్వలేదు. ఇప్పటికే నాలుగు టైటిళ్లు గెలిచిన చెన్నై.. ఐదో ట్రోఫీపై కన్నేసింది. ఆ క్రమంలోనే వచ్చే సీజన్‌లో టీమ్‌ను పటిష్టంగా మార్చాలనుకుంటుంది. ఈ నేపథ్యంలోనే జట్టులోని ఓ నలుగురి ఆటగాళ్లను వదిలేయాలనుకుంటుంది.

క్రిస్ జోర్డాన్..
ఇంగ్లండ్ టీ20 స్పెషలిస్ట్ అయిన క్రిస్ జోర్డాన్‌ను చెన్నై మెగా వేలంలో రూ.3.60 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ జోర్డాన్ జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. చెత్త బౌలింగ్‌తో దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసాడు. అంతేకాకుండా ఓవర్‌కు 8.9 పరుగులిచ్చాడు.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18వ ఓవర్‌లో 25 పరుగులిచ్చి జట్టు ఓటమికి కారణమయ్యాడు. ఆ మ్యాచ్ తర్వాత జోర్డాన్‌ను బెంచ్‌కే పరిమితం చేశారు. డ్వేన్ బ్రావో కెరీర్ చివరి దశలో ఉండటంతో అతనికి ప్రత్యామ్నాయంగా జోర్డాన్‌ను తీసుకున్నప్పటికీ అతను జట్టు అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ క్రమంలో అతనికి బదులు మంచి ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలని సీఎస్‌కే ఆలోచన చేసే అవకాశం ఉంది.

తుషార్ దేశ్ పాండే..
భారత అనామక ప్లేయర్ తుషార్ దేశ్ పాండే రూ.20 లక్షల కనీస ధరకు చెన్నై కొనుగోలు చేసింది. దీపక్ చాహర్‌కు బ్యాకప్‌గా ఉంటాడని భావించి అతనిపై సీఎస్‌కే నమ్మకం ఉంచింది. కానీ దీపక్ చాహర్ గాయంతో దూరమవ్వడంతో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడించగా.. అతను దారుణంగా విఫలమయ్యాడు. ఒక్క వికెట్ మాత్రం తీసి ఓవర్‌కు 10 పరుగుల చొప్పున సమర్పించుకున్నాడు.
దాంతో అతన్ని బెంచ్‌కే పరిమితం చేశారు. అతనికి బదులు సిమ్రన్‌జిత్ సింగ్, ముఖేష్ చౌదరిలకు అవకాశం ఇవ్వగా వారు సత్తా చాటారు. ముఖ్యంగా కెప్టెన్ ధోనీని ఆకట్టుకున్నారు. దాంతో తుషార్ దేశ్ పాండేకు డోర్లు మూసుకుపోయాయి. ఈ క్రమంలోనే సీఎస్‌కే అతన్ని వదులుకోనుంది.

రాబిన్ ఊతప్ప..
ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై టైటిల్ గెలవడంలో రాబిన్ ఊతప్పది కీలక పాత్ర. ఆ సీజన్‌లో 13 మ్యాచ్‌ల వరకు బెంచ్‌కే పరిమితమైన ఊతప్పకు సురేశ్ రైనా గాయపడటంతో జట్టులో చోటు దక్కింది. ఫస్ట్ మ్యాచ్‌లో విఫలమైనా.. కీలక క్వాలిఫయర్, ఫైనల్లో మాత్రం సత్తా చాటాడు. దాంతో అతన్ని మళ్లీ కొనుగోలు చేసిన చెన్నై.. సురేశ్ రైనాను వదులుకుంది.
అయితే ఈ సీజన్‌లో మాత్రం ఊతప్ప ఆ జోరును కొనసాగించలేకపోయాడు. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో 3, 30, 1, 1,0, 1 దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతన్ని ఓపెనర్‌గా తప్పించిన సీఎస్‌కే.. డేవాన్ కాన్వేకు అవకాశం ఇచ్చింది. ఊతప్పను మిడిలార్డర్‌కు డిమోట్ చేసింది. మొత్తం 12 మ్యాచ్‌ల్లో 20.90 సగటుతో ఊతప్ప 230 పరుగులే చేశాడు. అతని కెరీర్ కూడా చివరి దశలో ఉండటంతో సీఎస్‌కే వదిలేయాలనుకుంటుంది.

ఆడమ్ మిల్నే..
న్యూజిలాండ్ పేసర్ ఆడమ్ మిల్నేను సీఎస్‌కే వదులుకునే అవకాశం ఉంది. లీగ్‌లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన ఆడమ్ మిల్నే గాయంతో జట్టుకు దూరమయ్యాడు. దాంతో సీఎస్‌కే శ్రీలంక పేసర్, జూనియర్ మలింగా మతీషా పతిరణతో అతని స్థానాన్ని భర్తీ చేసుకుంది. మతీషా తనదైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. దాంతో అతన్ని ధోనీ.. జట్టులో ఉంచుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఆడమ్ మిల్నేను వదిలేయనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications