
కేకేఆర్‌తో ఆఖరి మ్యాచ్..
సొంత అభిమానుల మధ్య ఆటకు గుడ్‌బై చెబుతానని గత సీజన్ సందర్భంగా స్పష్టం చేశాడు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో అప్‌కమింగ్ సీజన్ పాత తరహాలో హోమ్ అండ్ అవే ఫార్మాట్‌లో జరగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా సీఎస్‌కే ఏడు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. ధోనీ వయసు కూడా 41 ఏళ్లకు చేరడంతో ఐపీఎల్ 2023 సీజన్ చివరిదని స్పష్టమవుతోంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరకుంటే.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మే 14న జరిగే తమ చివరి లీగ్ మ్యాచే ధోనీకి వీడ్కోలు గేమ్ కానుంది.

ధోనీ నిర్ణయాలను ఊహించడం...
ప్లే ఆఫ్స్ చేరినా.. ఈ మ్యాచ్‌లోనే వీడ్కోలు ఏర్పాట్లు చేయనున్నారు. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. అయితే ధోనీ నిర్ణయాలను అంచనా వేయడం చాలా కష్టం. అతను ఆకస్మిక నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాడు. 2014లో టెస్ట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పడం కానీ, 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం కానీ, గత మూడు సీజన్లుగా ఐపీఎల్ ఆడటం కానీ ఎవరూ ఊహించలేదు.
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినప్పటి నుంచి ప్రతీ సీజన్ ధోనీకి చివరిదనే ప్రచారం జరిగింది. కానీ ధోనీ మాత్రం పొడిగించుకుంటూ వచ్చాడు. ఈ లీగ్ ఆరంభంలోనే అతను రిటైర్మెంట్ ప్రకటించినా ప్రకటించవచ్చు.

ఈ సీజనే చివరిది..
ఈ సీజన్ ధోనీకి చివరిదని సీఎస్‌కేకు చెందిన ఓ అధికారి తెలిపాడు. 'ఈ ఐపీఎల్ సీజన్ ధోనీకి చివరిది. మాకు తెలిసింది కూడా ఇదే. అయితే రిటైర్మెంట్ అనేది ధోనీ వ్యక్తిగత నిర్ణయం. ఈ విషయంపై మేనేజ్‌మెంట్‌తో ధోనీ ఇంత వరకు అధికారికంగా చర్చించలేదు.
తాను వీడ్కోలు పలుకుతానని చెప్పలేదు. చాలా రోజుల తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లు చెన్నై వేదికగా జరగనుండటం అభిమానులందరికి ప్రత్యేకం. కానీ ధోనీ చివరి సీజన్ అనేది నిరాశ కలిగించే అంశం.'అని సీఎస్‌కే అఫిషయల్ ఒకరు ఇన్‌సైడ్ స్పోర్ట్ వెబ్‌సైట్ తెలిపారు.

ధోనీ వారసుడెవరు..?
ధోనీ తర్వాత చెన్నై జట్టును నడిపించేది ఎవరా? అనేది ఇప్పుడు సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. గత సీజన్‌లో రవీంద్ర జడేజా అట్టర్ ఫ్లాఫ్ కావడంతో తదుపరి కెప్టెన్‌పై సీఎస్‌కే ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఐపీఎల్ మినీ వేలంలో బెన్ స్టోక్స్ కొనుగోలు చేసిన సీఎస్‌కే.. అతనితో పాటు రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానేల పేర్లను పరిశీలిస్తోంది. స్టోక్స్ మంచి కెప్టెన్ అయినా.. దేశవాళీ కమిట్ మెంట్స్, గాయాల చరిత్ర నేపథ్యంలో వెనుకడుగు వేస్తోంది.


Click it and Unblock the Notifications
