IPL 2023: ఈ సారైనా టైటిల్ కరువు తీరేనా? ఆర్‌సీబీ పూర్తి జట్టు ఇదే!

హైదరాబాద్: ఐపీఎల్ ఫ్రాంచైజీల్లోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కు టైటిల్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. రెండు సార్లు ఫైనల్ చేరిన ఆ జట్టు తృటిలో టైటిల్ చేజార్చుకుంది. గతేడాది కెప్టెన్‌ను మార్చినా ఆర్‌సీబీ రాత మారలేదు. క్వాలిఫయర్-2లో ఓడి మూడో స్థానానికి పరిమితమైంది. జట్టు బలంగానే ఉన్న లక్ కలిసిరాలేదు. దాంతోనే కోర్‌టీమ్ మొత్తాన్ని అంటిపెట్టుకున్న ఆర్‌సీబీ.. అవసరం లేని అనామక ఆటగాళ్లను మాత్రమే వదిలేసింది. దాంతో ఆ జట్టు పర్స్‌లో రూ.8.75 కోట్లు మాత్రమే మిగిలాయి. ఈ డబ్బులతోనే శుక్రవారం జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలంలో పాల్గొన్న ఆర్‌సీబీ.. ఆచితూచి అడుగేసింది.

మయాంక్ కోసం పోటీపడినా..
కర్ణాటకకు చెందిన మయాంక్ అగర్వాల్, బెన్ స్టోక్స్ కోసం పోటీ పడినా.. వారు భారీ ధర పలకడంతో వదిలేసింది. పూర్తిగా బ్యాకప్ ఆప్షన్‌లపైనే ఫోకస్ పెట్టిన ఆర్‌సీబీ దేశవాళీ స్టార్లతో పాటు అంతర్జాతీయ ఆల్‌రౌండర్లను కొనుగోలు చేసింది. అద్భుతమైన వ్యూహాన్ని ప్రదర్శించి, ఏడుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఆర్‌సీబీ... 25 మంది కోటాను పూర్తి చేసుకుంది. వేలంలో మొత్తం రూ.7 కోట్లు వెచ్చించగా, ఇంకా రూ.1.75 కోట్లు ఆర్‌సీబీ పర్సులో మిగిలి ఉన్నాయి. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్వెస్ కోసం రూ.3.2 కోట్లు ఖర్చు పెట్టిన ఆర్‌సీబీ.. రీస్ టోప్లీని రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వేలంలో ఆర్‌సీబీ ఖర్చు పెట్టిన అత్యధిక కొనుగోళ్లు ఇవే కావడం విశేషం.

ఆర్‌సీబీ కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
సోను యాదవ్ (రూ.20 లక్షలు), అవినాష్ సింగ్ (రూ.60 లక్షలు), రాజన్ కుమార్ (రూ.70 లక్షలు), మనోజ్ భాండాగే (రూ.20 లక్షలు), విల్ జాక్వెస్ (రూ.3.2 కోట్లు), హిమాన్షు శర్మ (రూ.20 లక్షలు), రీస్ టాప్లీ (రూ.1.9 కోట్లు).

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పూర్తి జట్టు:
ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, రజత్ పటీదార్, దినేష్ కార్తీక్, అనూజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్‌వెల్, వానిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ , మహిపాల్ లోమ్రోర్, మహమ్మద్ సిరాజ్, జోష్ హెజిల్‌వుడ్, సిద్ధార్థ్ కౌల్, ఆకాష్ దీప్, సోనూ యాదవ్, అవినాష్ సింగ్, రాజన్ కుమార్, మనోజ్ భాండాగే, విల్ జాక్స్, హిమాన్షు శర్మ, రీస్ టాప్లీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications