IPL 2023 Mini Auction: సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే!

కొచ్చి: ఐపీఎల్ 2022 సీజన్ వైఫల్యంతో టీమ్ ప్రక్షాళనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో పాటు 13 మంది ఆటగాళ్లను వేలంలోకి వదిలేసింది. 12 మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకొని రూ.42.25 కోట్ల అత్యధిక పర్స్‌మనీతో మినీ వేలం బరిలోకి దిగింది. గత సీజన్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకున్న సన్‌రైజర్స్ ఈసారి ఆ సమస్యను అధిగమించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ యువ బ్యాటర్ హరీ బ్రూక్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో పోటీ పడి మరీ రూ.13.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ ఓ ఆటగాడి కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం ఇదే తొలిసారి.
అనామక ఆటగాళ్లపై కనక వర్షం..
2018 వేలంలో మనీశ్ పాండే కోసం రూ.11 కోట్లు ఖర్చు చేయడమే ఇప్పటి వరకు అత్యధికం. తాజా వేలంలో ఈ రికార్డును హరీ బ్రూక్ అధిగమించాడు. పంజాబ్ కింగ్స్ వదిలేసిన మయాంక్ అగర్వాల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.8.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆర్‌సీబీ, పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్‌తో పోటీ పడి మరీ మయాంక్ అగర్వాల్‌ను దక్కించుకుంది. సౌతాఫ్రికా వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసెన్‌కు రూ.5.25 కోట్లు ఖర్చు చేసిన సన్‌రైజర్స్.. అనామక ఆటగాళ్లు అయిన మయాంక్ దగర్ రూ.1.8 కోట్లు, వివ్రాంత్ శర్మ రూ.2.6 కోట్లు కనక వర్షం కురిపించింది.
13 మంది కోసం 35.7 కోట్లు ఖర్చు..
ఆల్‌రౌండర్లపై కాస్త ఎక్కువ ఫోకస్ పెట్టిన సన్‌రైజర్స్ స్టార్ ఆటగాళ్లను తీసుకోవడంలో మాత్రం విఫలమైంది. బెన్ స్టోక్స్ కోసం ప్రయత్నించినా.. దక్కలేదు. మొత్తం 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్.. 25 మంది సభ్యులతో జట్టును పూర్తి చేసింది. 13 మంది కోసం రూ.35.7 కోట్లు ఖర్చు చేసింది. సన్‌రైజర్స్ పర్స్‌లో ఇంకా రూ.6.55 కోట్లు ఉన్నాయి.
సన్‌రైజర్స్ రిటైన్ ప్లేయర్స్..
అబ్దుల్ సమద్(రూ.4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్(రూ.4 కోట్లు), వాషింగ్టన్ సుందర్ (రూ.8.75 కోట్లు), రాహుల్ త్రిపాఠి(రూ.8.5 కోట్లు), అభిషేక్ శర్మ(రూ.6.5 కోట్లు), కార్తీక్ త్యాగీ(రూ.4 కోట్లు), టీ నటరాజన్(రూ.4 కోట్లు), భువనేశ్వర్ కుమార్(రూ.4.2 కోట్లు), ఎయిడెన్ మార్క్‌రమ్(రూ.2.6 కోట్లు), మార్కో జాన్సెన్(రూ.4.2 కోట్లు), గ్లేన్ ఫిలిప్స్(రూ.1.5 కోట్లు), ఫజలఖ్ ఫరూఖీ(రూ.50 లక్షలు)
సన్‌రైజర్స్ వేలంలో కోన్న ఆటగాళ్లు
హరీబ్రూక్(13.25 కోట్లు), మయాంక్ అగర్వాల్(రూ.8.25 కోట్లు), హెన్రీచ్ క్లాసెన్(రూ.5.25 కోట్లు), ఆదిల్ రషీద్(రూ.2 కోట్లు), మయాంక్ మార్కండే(రూ.50 లక్షలు), వివ్రాంత్ శర్మ(రూ.2.6 కోట్లు), సమర్థ్ వ్యాస్(రూ.20 లక్షలు), ఉపేంద్ర సింగ్ యాదవ్(రూ.25 లక్షలు), మయాంక్ దగర్(రూ.1.8 కోట్లు), అకీల్ హోస్సెన్(రూ.కోటి), నితీశ్ కుమార్(రూ.20 లక్షలు), అన్‌మోల్ ప్రీత్ సింగ్(రూ.20 లక్షలు)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications