Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 Mini Auction: చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టు ఇదే!

IPL 2023: Complete Chennai Super Kings (CSK) Squad and Players Price List

హైదరాబాద్: ఐపీఎల్ 2023 టైటిలే లక్ష్యంగా సిద్దమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్.. మినీ వేలంలో దూకుడు కనబర్చింది. జట్టుకు కావాల్సిన ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించింది. కొచ్చి వేదికగా జరుగుతున్న మినీ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కోసం ఏకంగా రూ.16.25 కోట్లు ఖర్చు చేసింది. వేలంలో ఓ ఆటగాడి కోసం చెన్నై ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం ఇదే తొలిసారి. 4డీ ప్లేయర్ అయిన బెన్ స్టోక్స్‌తో జట్టు బలాన్ని అమాంతం పెంచుకుంది. బిగ్ మ్యాచ్ ప్లేయర్ అయిన స్టోక్స్.. సమర్థవంతంగా కెప్టెన్సీ చేయగలడు. కెప్టెన్సీ ఆప్షన్ కోసమే స్టోక్స్‌‌ను తీసుకున్నట్లు అర్థమవుతోంది.

రూ.20.45 కోట్లలో రూ16.25 కోట్లు ఒక్కడికే..

రూ.20.45 కోట్లలో రూ16.25 కోట్లు ఒక్కడికే..

రూ.20.45 కోట్ల పర్స్ మనీతో ఐపీఎల్ 2023 మినీ వేలంలో పాల్గొన్న సీఎస్‌కే స్టోక్స్ ఒక్కడి కోసమే రూ.16.25 కోట్లు ఖర్చు పెట్టడం గమనార్హం. ధోనీ, స్టోక్స్ గతంలో రైజింగ్ పుణే తరఫున ఆడారు. ఇక సీఎస్‌కే బెస్ట్ ఆల్‌రౌండర్ డ్వాన్ బ్రావో రిటైర్మెంట్ ప్రకటించడంతో.. అతని స్థానాన్ని సీఎస్‌కే స్టోక్స్‌తో భర్తీ చేసింది. స్టోక్స్‌తో పాటు వ్యూహాత్మకంగా అజింక్యా రహానేను తీసుకుంది. సత్తా ఉన్న అనామక ఆటగాళ్లపై కూడా సీఎస్‌కే ఫోకస్ పెట్టింది. తెలుగు తేజం షేక్ రషీద్, నిషాంత్ సింధు, అజయ్ మండల్, భగత్ వర్మ‌లను తీసుకొని 25 మంది సభ్యులతో జట్టును పూర్తి చేసింది.

చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ ప్లేయర్స్..

మహేంద్ర సింగ్ ధోనీ(కెప్టెన్), అంబటి రాయుడు, దీపక్ చాహర్, డేవాన్ కాన్వే, డ్వేన్ ప్రిటోరియస్, మహీశ్ తీక్షణ, మతీష పతీరాణ, మిచెల్ సాంట్నర్, మోయిన్ అలీ, ముఖేశ్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, రాజవర్థన్ హంగార్గేకర్, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దుబే, సిమర్జీత్ సింగ్, సుభ్రాన్షు సేనపతి, తుషార్ దేశ్‌పాండే

మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు..

బెన్ స్టోక్స్(రూ.16.25 కోట్లు), షేక్ రషీద్(రూ.20 లక్షలు), అజింక్యా రహానే(రూ.50 లక్షలు), నిశాంత్ సింధు(రూ.60లక్షలు), కైల్ జెమీసన్(రూ. కోటి), అజయ్ మండల్(రూ.20 లక్షలు), భగత్ వర్మ(రూ.20 లక్షలు)

Story first published: Friday, December 23, 2022, 21:09 [IST]
Other articles published on Dec 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+