Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: బ్యాటింగ్ బ్రహ్మాండం...బౌలింగ్ బలహీనం.. సీఎస్‌కే తుది జట్టు అంచనా ఇదే!

IPL 2023: Chennai Super Kings Strength, Weakness and Playing XI Prediction

IPL 2023: Chennai Super Kings Strength, Weakness and Playing XI Prediction: పదమూడు సీజన్లు.. నాలుగుసార్లు విజేత.. ఐదుసార్లు రన్నరప్.. ఓసారి సెమీస్.. మరోసారి ప్లే ఆఫ్స్.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) ట్రాక్ రికార్డు ఇది. స్పాట్ ఫిక్సింగ్ మకిలి అంటుకున్నా.. రెండేళ్లు లీగ్‌కు దూరమైనా.. ఆట పరంగా మాత్రం సీఎస్‌కే స్థాయి ఎవరెస్ట్.

మిగతా ఫ్రాంచైజీల మాదరిగా వరల్డ్ క్లాస్ సూపర్ స్టార్లు లేకపోయినా.. స్కిల్డ్ ప్లేయర్లు లభించకపోయినా.. యంగ్ గన్స్ అండ దొరకకపోయినా.. కేవలం ఇద్దరు, ముగ్గురు ప్లేయర్ల అనుభవంతోనే టైటిల్స్‌ను కొల్లగొట్టడం చెన్నై ప్రత్యేకం! మరీ ముఖ్యంగా కూల్ కెప్టెన్ మహేంద్రుడి మాయాజాలం.. చెన్నైకి అన్నిటికంటే పెద్ద మహిమ! ఆ మహిమతోనే మరో టైటిల్ అందుకునేందుకు డాడీస్ ఆర్మీ సిద్దమవుతోంది. అయితే గత రెండు సీజన్లలో దారుణంగా విఫలమైన సీఎస్‌కే ఈ సారైనా మెరుగైన ప్రదర్శన చేస్తుందో లేదో చూడాలి!

సీఎస్‌కే బలాలు..

ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(Ben Stokes) జట్టులో భాగమవ్వడం చెన్నై సూపర్ కింగ్స్‌కు బాగా కలిసొచ్చే అంశం. అతని పవర్ హిట్టింగ్ ఎబిలిటీ.. ఒకటి రెండు ఓవర్ల పాటు బౌలింగ్ చేయడం జట్టుకు అడ్వాంటేజ్‌గా మారనుంది. స్లో వికెట్ అయిన చెపాక్ స్టేడియంలో రవీంద్ర జడేజా, మొయిన్ అలీ కీలకం కానున్నారు.

డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni), జడేజాలతో సాలిడ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడుకునేందుకు అజింక్యా రహానే కూడా అందుబాటులో ఉన్నాడు.

సీఎస్‌కే బలహీనతలు..

గత సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన యువ పేసర్ ముఖేశ్ చౌదరి గాయంతో జట్టుకు దూరమవ్వడం సీఎస్‌కేకు గట్టి ఎదురుదెబ్బ. అతనితో పాటు దీపక్ చాహర్ కూడా గాయంతో ఇబ్బంది పడుతుండటం ఆ జట్టును మరింత కష్టాల్లోకి నెట్టింది. గాయంతో దీపక్ చాహర్ ఏ మేరకు రాణిస్తాడో అనేది అనుమానంగా మారింది.

మహేంద్ర సింగ్ ధోనీ ఫామ్‌పై కూడా సందేహాలు నెలకొన్నాయి. కెరీర్ చివరి దశలో ఉన్న ధోనీ.. గత రెండు సీజన్లలో పెద్దగా ప్రభావం చూపలేదు. అంబటి రాయుడు కూడా ఎలా రాణాస్తాడనేదానిపై సందేహాలున్నాయి. ఓవరాల్‌గా బ్యాటింగ్ బలంగా కనిపిస్తున్నా.. బౌలింగ్ బలహీనంగా ఉంది.

సీఎస్‌కే తుది జట్టు(అంచనా)

రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, బెన్ స్టోక్స్, శివమ్ ధూబే, మహేంద్ర సింగ్ ధోనీ(కెప్టెన్), రవీంద్ర జడేజా, దీపక్ చాహర్/రాజవర్థన్ హంగార్కరే, ముఖేశ్ చౌదరి/తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ

సీఎస్‌కే పూర్తి జట్టు:

ఎంఎస్ ధోనీ, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాన్షు సేనపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజవర్థన్ హంగార్గేకర్, డ్వేన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, ముఖేశ్ చౌదరి, మతీషా పతీరణ, సిమర్జీత్ సింగ్, దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహీశ్ తీక్షణ, అజింక్యా రహానే, బెన్ స్టోక్స్, షేక్ రషీద్, నిశాంత్ సింధు, కైల్ జెమీసన్, అజయ్ మండల్, భగత్ వర్మ

Story first published: Wednesday, March 29, 2023, 16:17 [IST]
Other articles published on Mar 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+