Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్.. ధోనీ మాస్టర్ మైండ్ ముందు తేలిపోయిన గుజరాత్!

చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గుజరాత్ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. మహేంద్ర సింగ్ ధోనీ ట్రేడ్ మార్క్ కెప్టెన్సీతో సీఎస్‌కే ఈ మ్యాచ్‌లో విజయాన్నందుకుంది. ఈ విజయంతో చెన్నై ఫైనల్ చేరగా.. గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-2 ఆడనుంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(44 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 60) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. డెవాన్ కాన్వే(34 బంతుల్లో 4 ఫోర్లతో 40), రవీంద్ర జడేజా(16 బంతుల్లో 2 ఫోర్లతో 22) పర్వాలేదనిపించారు.

IPL 2023

గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ రెండేసి వికెట్లు తీయగా.. దర్శన్ నల్కండే, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మోమిత్ శర్మ తలో వికెట్ తీసారు.

అనంతరం గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులకు కుప్పకూలింది. శుభ్‌మన్ గిల్(38 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 42), రషీద్ ఖాన్(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) మినహా అంతా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్‌పాండే, మతీశ పతీరణ తలో వికెట్ తీసారు.

లక్ష్య చేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ దీపక్ చాహర్ తన వరుస ఓవర్లలో ఓపెనర్ వృద్దిమాన్ సాహా(12), హార్దిక్ పాండ్యా(8)లను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. సాహా క్యాచ్‌ను పతీరణ, హార్దిక్ క్యాచ్‌ను తీక్షణ పట్టుకున్నారు. దాంతో పవర్ ప్లేలో గుజరాత్ టైటాన్స్ 2 వికెట్ల కోల్పోయి 41 పరుగులు మాత్రమే చేసింది.

ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన డసన్ షనక(17)తో కలిసి శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. 31 పరుగులతో క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేసిన ఈ జోడీని రవీంద్ర జడేజా విడదీసాడు. డసన్ షనకను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

మరుసటి ఓవర్‌లో డేంజరస్ డేవిడ్ మిల్లర్(4)ను క్లీన్ బౌల్డ్ చేసిన జడేజా.. మ్యాచ్‌ను తమవైపుకు తిప్పుకున్నాడు. హాఫ్ సెంచరీకి చేరువైన శుభ్‌మన్ గిల్‌కు ధోనీ మాస్టర్ ప్లాన్‌తో చెక్ పెట్టాడు. దీపక్ చాహర్‌ను రంగంలోకి దింపి స్లోయర్ బాల్‌తో ఉచ్చును బిగించాడు. ఫైన్ లెగ్ వైపు చాహర్ భారీ షాట్ ఆడగా.. మిస్ టైమ్ అయిన బంతి గాల్లోకి లేచి అక్కడే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న డేవాన్ కాన్వే చేతిలో పడింది.

ఆ వెంటనే రాహుల్ తెవాటియా(3)ను తీక్షణ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో గుజరాత్ ఓటమి కాయమని అంతా అనుకున్నారు. కానీ క్రీజులోకి వచ్చిన రషీద్ ఖాన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. పతీరణ వేసిన 16వ ఓవర్‌లో సిక్స్, బౌండరీ బాదిన రషీద్.. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో మరో 6,4 బాదాడు. విజయ్ శంకర్ కూడా ఓ సిక్స్ బాదడంతో 19 పరుగులు వచ్చాయి.

పతీరణ వేసిన 18వ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన విజయ్ శంకర్(14) రుతురాజ్ గైక్వాడ్ అసాధారణ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేరాడు. ఆ మరుసటి బంతికే దర్శన్ నల్కండే(0) రనౌట్‌గా వెనుదిరిగాడు. చివరి 12 బంతుల్లో గుజరాత్ విజయానికి 35 పరుగులు అవసరమవ్వగా.. తుషార్ దేశ్‌పాండే వేసిన చివరి ఓవర్‌లో బౌండరీ బాదిన రషీద్ ఖాన్.. మరుసటి బంతికే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. చివరి ఓవర్ చివరి బంతికి షమీ(5) ఔటవ్వడంతో చెన్నై విజయం లాంఛనమైంది.

Story first published: Tuesday, May 23, 2023, 23:38 [IST]
Other articles published on May 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+