IPL 2023 ధరతో నా కళ్లు నెత్తికెక్కలేదు: కామెరూన్ గ్రీన్

మెల్‌బోర్న్: ఐపీఎల్ 2023 మినీ వేలంలో భారీ ధర పలకడం తనను, తన ఆటను ఏ మాత్రం మార్చదని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ అన్నాడు. ఇంత ధర పలకాల్సిన స్థాయి తనది కాదని, అనుకోకుండా వచ్చినదేనని తెలిపాడు. కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలంలో 23 ఏళ్ల కామెరూన్ గ్రీన్‌ను ముంబై ఇండియన్స్.. రూ.17.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కీరన్ పొలార్డ్ స్థానానికి సరిగ్గా సరిపోతాడని భావించిన ముంబై.. ప్రత్యర్థి ఫ్రాంచైజీలతో పోటీపడి మరీ తీసుకుంది. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే గ్రీన్.. రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.
రూ.17.5 కోట్ల భారీ ధర పలికాననే ఉత్సాహమో ఏమో కానీ సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌లో కామెరూన్ గ్రీన్ దుమ్మురేపాడు. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌లో గ్రీన్(5/27) ఐదు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు. 10.4 ఓవర్లలో మూడు ఓవర్లు మెయిడిన్ చేసిన గ్రీన్..27 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. దాంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 68.4 ఓవర్లలో 189 పరుగులు మాత్రమే చేసింది.
ఈ ప్రదర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన గ్రీన్.. ఐపీఎల్ సొమ్ముతో తల పొగరు నెత్తికెక్కలేదని స్పష్టం చేశాడు. 'ఇంత పెద్ద మొత్తం పొందాల్సిన స్థాయిలో నేనేమీ చేయలేదు. నా పేరును వేలంలో నమోదు చేసుకున్నానంతే. అనుకోకుండా అంత పెద్ద ధర పలికింది. అది వ్యక్తిగా నన్ను కానీ.. నా ఆటను కానీ మార్చదు. ఈ డబ్బుతో నేను పెద్దగా మారనని ఆశిస్తున్నా. ఆల్‌రౌండర్స్ సుదీర్ఘకాలం ఆడాలంటే వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ ముఖ్యం. బ్యాటింగ్, బౌలింగ్‌లు రెండింటిలోనూ సమానంగా కృషి చేయడం చాలా కష్టం. అందులో ఏదో ఒకదానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రెండు విభాగాల్లోనూ తీవ్రంగా శ్రమిస్తే ఒత్తిడి పెరుగుతుంది. మ్యాచ్‌కు ముందు నా ప్రాధాన్యత బ్యాటింగ్‌కే ఉంటుంది. మ్యాచ్ రోజు బౌలింగ్‌పై ఎక్కువ దృష్టిపెడతాను.'అని చెప్పుకొచ్చాడు.
45/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్(254 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 200) డబుల్ సెంచరీతో చెలరేగడంతో 82 ఓవర్లలో 3 వికెట్లకు 355 పరుగులు చేసింది. వార్నర్‌కు తోడుగా స్టీవ్ స్మిత్(85) రాణించాడు. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్(33 బ్యాటింగ్), కామెరూన్ గ్రీన్(0 బ్యాటింగ్) ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 166 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications