Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోల్‌కతా ఓడించలేదు.. మేమే ఓడిపోయాం.. సన్‌రైజర్స్ కోచ్ అసహనం!

హైదరాబాద్: కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ తమను ఓడించలేదని, తామే ఓటమిపాలయ్యామని సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ బ్రియాన్ లారా తెలిపాడు. తమ జట్టు ఆటతీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ ఓటమిపై స్పందించిన సన్‌రైజర్స్ హెడ్‌కోచ్‌ బ్రియాన్ లారా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

'ప్రతీ మ్యాచ్‌లో పవర్‌ప్లేలో రెండు వికెట్లు కోల్పోతూనే ఉన్నాం. ఆ తర్వాత పరిస్థితులను ఇది కష్టంగా మారుస్తోంది. ఇక ఆరో స్థానంలో వచ్చి అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్న క్లాసెన్‌ మరింత కష్టపడాలని కోరుతున్నాం. అతనికి ముందు ఐదుగురు నాణ్యమైన బ్యాటర్లు ఉన్నారు. ఇలాంటి మ్యాచ్‌ల్లో విజయం సాధించాలంటే ఎంత బాధ్యతాయుతంగా ఆడాలో బ్యాటర్లకు తెలుసు. అయినా మా ఆటగాళ్లు అలా ఆడలేకపోతున్నారు.

brainlara

భాగస్వామ్యాలను నిర్మించడానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. మ్యాచ్‌ పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకెళ్లాలి. దూకుడుగా ఉండటం మంచిదే.. అయితే పని పూర్తి చేయడానికి ఆధిక్యాన్ని కూడా కనబరచాలి. ఈ మ్యాచ్‌లో వారు మమ్మల్ని ఓడించలేదు. మేమే చేజేతులా ఓడిపోయాం. మా చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను కోల్పోయాం' అని లారా చెప్పుకొచ్చాడు. ఇక కోల్‌కతాలో ప్రపంచ స్థాయి స్పిన్నర్లు ఉన్నారని.. సునీల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తీలను లారా కొనియాడాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్ నితీశ్ రాణా(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), రింకూ సింగ్(35 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 46) రాణించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్, మార్కో జాన్సెన్ రెండేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగీ, ఎయిడెన్ మార్క్‌రమ్, మయాంక్ మార్కండే తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(40 బంతుల్లో 4 ఫోర్లతో 41), హెన్రీచ్ క్లాసెన్(20 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 36) రాణించినా ఫలితం లేకపోయింది. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, ఆండ్రీ రస్సెల్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ పడగొట్టారు.

ఆఖరి ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తీ మూడు పరుగులు మాత్రమే ఇచ్చి కేకేఆర్‌ను గెలిపించాడు. ఈ ఓటమితో హైదరాబాద్‌ ప్లేఆఫ్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఆరు ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది.

Story first published: Friday, May 5, 2023, 14:41 [IST]
Other articles published on May 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+