Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 సీజన్‌లో మరో నాలుగు కొత్త రూల్స్!

 IPL 2023: Big rules changes in IPL 16, teams will name their playing XIs after the toss

హైదరాబాద్: క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2023 సీజన్‌కు సమయం ఆసన్నమైంది. మరో 11 రోజుల్లో (మార్చి 31) ఈ ధనాధన్ లీగ్‌కు తెరలేవనుంది. ఇప్పటికే లీగ్‌లోని 10 ఫ్రాంచైజీలు అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో తమ సన్నాహకాలు మొదలుపెట్టాయి. మరోవైపు బీసీసీఐ కూడా 16వ సీజన్‌ను మరింత ఆసక్తికరంగా మలిచేందుకు ప్రణాళికలను సిద్దం చేసింది. ఇప్పటికే ఇంపాక్ట్ ప్లేయర్‌ రూల్‌‌ను ప్రవేశపెట్టడంతో పాటు టీమ్స్ రివ్యూల సంఖ్యను కూడా పెంచేసింది. వైడ్, నోబాల్‌లకు కూడా రివ్యూలు తీసుకునే అవకాశం కల్పించింది.

ఈ రెండు రూల్సే కాకుండా మరో నాలుగు నిబంధనలను కొత్తగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌ఇన్‌ఫో.. ఓ కథనాన్ని ప్రచురించింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇరు జట్లు టాస్ వేసిన తర్వాత తమ తుది జట్లను ప్రకటించేలా కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ నిబంధనతో టాస్ నిర్ణయాన్ని బట్టి తుది జట్టును, ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఆయా జట్లు ఎంపిక చేసుకోవచ్చు.

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఈ నిబంధనను తొలిసారి అమలు చేయగా.. ఐపీఎల్‌లో రెండోసారి అమలు చేస్తున్నారు. భారత మైదానాల్లో డ్యూ ప్రభావం కీలకం కానున్న నేపథ్యంలో ఈ నిబంధన ఆయా జట్లకు ఉపయోగపడనుంది. టాస్ గెలిచి బ్యాటింగ్, ఫీల్డింగ్ ఎంచుకునేదాన్ని బట్టి తుది జట్టును ఎంచుకునే వెసులు బాటు కలుగుతోంది. ఇప్పటి వరకు ఇరు జట్లు టాస్‌కు ముందే తమ తుది జట్లను ప్రకటించేవి.

ఈ టాస్ రూల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో అమలు చేస్తున్న స్లో ఓవరేట్ పెనాల్టీ రూల్‌ను కూడా అమలు చేయనున్నారు. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయకుంటే.. సర్కిల్ బయటన నలుగురు ఫీల్డర్లను మాత్రమే అనుమతిస్తున్న విషయం తెలిసిందే. ఎన్ని ఓవర్లు తక్కువైతే.. అన్ని ఓవర్ల పాటు సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే ఈ రూల్ అమలవుతుండగా.. ఐపీఎల్‌లో మొదటిసారి ప్రవేశపెట్టనున్నారు.

వికెట్ కీపర్, ఫీల్డర్ అనైతిక చర్యకు ఐదు పరుగులు పెనాల్టీ‌గా విధించడంతో పాటు ఆ బంతిని డెడ్‌బాల్‌గా పరిగణించనున్నారు. ఉద్దేశపూర్వకంగా బ్యాటర్‌ దృష్టి మరల్చినా.. ఇబ్బందిపెట్టినా అనైతిక చర్యగా భావిస్తారన్న విషయం తెలిసిందే.

Story first published: Wednesday, March 22, 2023, 18:56 [IST]
Other articles published on Mar 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+