Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కోలుకోలేని దెబ్బ.. గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ దూరం!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుస పరాజయాలతో చతికిలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తీవ్ర గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ట్విటర్ వేదికగా గురువారం ప్రకటించింది.

వాషింగ్టన్ సుందర్ తొడ కండరాల గాయంతో భాదపడుతున్నాడని, అతను ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడని ట్వీట్ చేసింది. వాషింగ్టన్ సుందర్ త్వరగా కోలుకోవాలని ఫ్రాంచైజీ ఆశిస్తుందని పేర్కొంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్(3/28, 24 నాటౌట్) ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చాడు. మూడు వికెట్లతో పాటు బ్యాటింగ్‌లో విలువైన పరుగులు చేశాడు. అతనికి అండగా ఎవరూ రాణించకపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు.

Washington Sundar ruled out

తొలి 6 మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క వికెట్ కూడా తీయని వాషింగ్టన్ సుందర్.. ఢిల్లీతో ఫామ్ అందుకోగానే గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు. అసలే లోయరార్డర్ బ్యాటింగ్‌ లేక ఇబ్బంది పడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సుందర్ దూరమవ్వడం కోలుకోలేని దెబ్బ.

టీమ్ కాంబినేషన్ కూడా ఇబ్బంది కానుంది. ఇప్పటి వరకు అయితే సుందర్ రిప్లేస్‌మెంట్ ఆటగాడి పేరును ప్రకటించలేదు. ఇక వాషింగ్టన్ సుందర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.8.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండింటిలో మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది. ప్రస్తుత పరిస్థితుల్లో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన 7 మ్యాచ్‌ల్లో కనీసం 5 మ్యాచ్‌లు గెలవాలి. రన్ రేట్ కూడా మెరుగ్గా ఉండాలి. కానీ వాషింగ్టన్ సుందర్ దూరమవడం.. జట్టులో అతన్ని భర్తీ చేసే ఆటగాడు లేకపోవడం సన్‌రైజర్స్ విజయవకాశాలను దెబ్బతీయనుంది.

Story first published: Thursday, April 27, 2023, 11:34 [IST]
Other articles published on Apr 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+