Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: ఆర్‌సీబీకి షాకిచ్చిన మ్యాక్సీ మామ.!

IPL 2023: Big blow for RCB as Glenn Maxwells major update on leg injury before IPL 16

బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్ ముంగిట రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీకీ ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) షాకిచ్చాడు. తాను పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని, ఈ టోర్నీ బరిలోకి దిగడం కష్టమేనని తెలిపాడు. ఈ సీజన్ కోసం బెంగళూరుకు వచ్చినా.. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నానని వెల్లడించాడు. ఈ మాటలు ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే వేలంలో ఏరి కోరి తీసుకున్న విల్ జాక్స్ గాయంతో దూరమవ్వగా.. అతని స్థానాన్ని న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్‌తో ఆర్‌సీబీ భర్తీ చేసింది. ఇప్పుడు మ్యాక్సీ మామ.. తాను ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని వెల్లడించడంతో అభిమానుల్లో కలవరపాటు మొదలైంది.

ఆర్‌సీబీ ఫ్రాంచైజీతో కలిసి సందర్భంగా మాట్లాడిన మ్యాక్సీ మామ.. 100 శాతం ఫిట్‌నెస్ సాధించడానికి మరికొంత సమయం పడుతుందన్నాడు. 'ఇప్పటికైతే నా కాళ్లు బాగానే ఉన్నాయి. కానీ 100 శాతం ఫిట్‌నెస్ సాధించాడానికి మరికొంత సమయం పడుతుంది. ఏదేమైనా సజావుగా సాగి టోర్నీ మొత్తం బాగా ఆడాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నా.'అని మ్యాక్స్‌వెల్ చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియాలో గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఓ బర్త్ డే పార్టీకి వెళ్లిన మ్యాక్సీ పీకల్‌దాక తాగి కాలు విరగ్గొట్టుకున్నాడు. దాంతో సుమారు 4-5 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇటీవలే భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌తో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. తొలి వన్డేలో 8 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమైన మ్యాక్సీ.. ఫిట్‌నెస్ సమస్యలతో చివరి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించందే.. మ్యాక్సీని ఆసీస్ టీమ్‌కు ఎందుకు ఎంపిక చేశారనే విమర్శలు కూడా వచ్చాయి.

ఐపీఎల్ 2023 సీజన్ అయినా ఆడుతాడా? ఫిట్‌నెస్ సమస్యలతో బెంచ్‌కే పరిమితమవుతాడా? అనేది కాలమే సమాధానం చెప్పాలి. ఒకవేళ ఐపీఎల్‌లో బరిలోకి దిగినా మునపటిలా ధాటిగా ఆడుతాడా? అనేది అనుమానంగా మారింది. 2019 తర్వాత సొంతమైదానం అయిన బెంగళూరు వేదికగా ఆర్‌సీబీ మ్యాచ్‌లు ఆడనుంది. చిన్న మైదానం అయిన బెంగళూరులో మ్యాక్సీ చెలరేగుతాడని ఆర్‌సీబీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Saturday, March 25, 2023, 18:24 [IST]
Other articles published on Mar 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+