For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇక కావ్య పాప ముఖంలో నవ్వులే .. హరీ బ్రూక్ ట్రాక్ రికార్డు సూపరో సూపర్!

 IPL 2023 auction: Who is Harry Brook? All you need to know about SRHs new millionaire

హైదరాబాద్: ఐపీఎల్ 2023 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూకుడు కనబర్చింది. బలహీనంగా ఉన్న బ్యాటింగ్ విభాగాన్ని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టిన సన్‌రైజర్స్ వేలంలో ఇంగ్లండ్ యువ ప్లేయర్ హరీ బ్రూక్, భారత వెటరన్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్, సౌతాఫ్రికా ప్లేయర్ హెన్రీచ్ క్లాసెన్‌లను తీసుకుంది. హరీ బ్రూక్ కోసం రూ.13.25 కోట్లు ఖర్చు చేసిన సన్‌రైజర్స్.. మయాంక్ అగర్వాల్‌ను రూ.8.25 కోట్లకు తీసుకుంది.

అయితే ఐపీఎల్ అనుభవం లేని హరీ బ్రూక్‌కు భారీ మొత్తంలో ఖర్చు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవర్‌సీస్ ఆటగాళ్లు జట్టులో ఎక్కువయ్యారని, మిడిలార్డ్ కూడా ప్యాకప్‌ అయ్యిందని, హారీ బ్రూక్‌ను తీసుకోవడం వల్ల జట్టుకు ఏం ఉపయోగమని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

ట్రాక్ రికార్డు సూపరోసూపర్..

ట్రాక్ రికార్డు సూపరోసూపర్..

అయితే నికోలస్ పూరన్ స్థానాన్ని భర్తీ చేసేందుకే హరీ బ్రూక్‌ను తీసుకున్నామని సన్‌రైజర్స్ హెడ్ కోచ్ బ్రియాన్ లారా స్పష్టం చేశారు. కొందరు హ రీబ్రూక్ ఎంపికను సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు. అయితే హరీ బ్రూక్ ట్రాక్ రికార్డు ఏందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

రూ.13.25 కోట్లు పెట్టే సామర్థ్యం హరీ బ్రూక్‌కు ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. హరీ బ్రూక్ చేరికతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తిరుగుండదని, అతని ట్రాక్ రికార్డు పరిశీలిస్తేనే ఈ విషయం అర్థమవుతోందని, మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

పాక్ గడ్డపై మూడు సెంచరీలు..

పాక్ గడ్డపై మూడు సెంచరీలు..

23 ఏళ్ల హ్యారీ బ్రూక్.. ఇటీవల ముగిసిన పాకిస్థాన్ టెస్టు సిరీస్‌లో సత్తా చాటాడు. 17 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కోసం పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్

చారిత్రాత్మక విజయాన్నందుకోవడంలో హరీ బ్రూక్ కీలక పాత్ర పోషించాడు. మూడు టెస్టుల్లోనూ శతకాలు బాదిన హరీ బ్రూక్..468 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కరాచీ టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడంతోపాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ గణంకాలే సన్‌రైజర్స్‌ను ఆకర్షించినట్లు తెలుస్తోంది. టెస్ట్ ఫార్మాట్‌లో టీ20 తరహా బ్యాటింగ్ చేస్తున్న హ్యారీ బ్రూక్‌ను కొనుగోలు చేయాలని సన్‌రైజర్స్ గట్టిగా నిర్ణయించుకుంది. రాజస్థాన్ వ్యూహాత్మకంగా పోటిపడినా.. తగ్గేదేలే అంటూ దూకుడు కనబర్చింది.

ఇంగ్లండ్ కోహ్లీగా..

ఇంగ్లండ్ కోహ్లీగా..

హరీ బ్రూక్‌కు టీ20 ఫార్మాట్‌లోనూ మంచి రికార్డు ఉంది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ ఖాలాండర్స్‌కు ప్రాతినిథ్యం వహించే హరీ బ్రూక్‌కు ఉపఖండపు పరిస్థితుల గురించి కూడా మంచి అవగాహన ఉంది. పీఎస్‌ఎల్‌లో సెంచరీ బాదిన అత్యంత పిన్న వయస్కుడిగా హరీ బ్రూక్ రికార్డుకెక్కాడు.

బిగ్ బాష్ లీగ్‌లో హోబార్ట్ హరికేన్స్ తరఫున ఆడుతున్న బ్రూక్... మెన్స్ హండ్రెడ్‌లో నార్తర్న్ సూపర్ ఛార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకు 17 ఇన్నింగ్స్‌లు ఆడిన హరీ బ్రూక్ 26.57 యావరేజ్‌, 133.77 స్ట్రైక్ రేట్‌తో 372 రన్స్ చేసాడు. హయ్యెస్ట్ స్కోర్ 81 నాటౌట్. హ్యారీ బ్రూక్‌ను బెన్ స్టోక్స్ గతంలో విరాట్ కోహ్లీ ఆఫ్ ఇంగ్లిష్ క్రికెట్‌గా అభివర్ణించాడు.

భారత్‌లోఆడిన హరీ బ్రూక్

భారత్‌లోఆడిన హరీ బ్రూక్

2017లో భారత్‌లో పర్యటించిన ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2018లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హ్యారీ.. బంగ్లాదేశ్‌పై సెంచరీ చేశాడు. అలిస్టర్ కుక్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఇంగ్లిష్ క్రికెటర్‌గా నిలిచాడు.

ఆ టోర్నీలో బ్రూక్ 239 రన్స్ చేసి రైజింగ్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. 2022 జనవరిలో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా బ్రూక్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. నిలకడగా రాణించి టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మెగా టోర్నీలోనూ హరీ బ్రూక్ ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చాడు. ఇదే జోరును ఐపీఎల్ 2023లో కొనసాగిస్తే సన్‌రైజర్స్‌కు తిరుగుండదు.

Story first published: Saturday, December 24, 2022, 12:58 [IST]
Other articles published on Dec 24, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+