నికోలస్ పూరన్ అల్లాటప్పా ఆటగాడు కాదు.. దమ్మున్నోడు: గౌతమ్ గంభీర్

కొచ్చి: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ సాధాసీధా ఆటగాడు కాదని, దమ్మున్న ప్లేయరని లక్నోసూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ అన్నాడు. తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలడని చెప్పాడు. తనదైన ఆటతో గేమ్‌పై ప్రభావం చూపలగడనే వేలంలో పోటీపడి మరీ కొనుగోలు చేశామని గంభీర్ చెప్పుకొచ్చాడు. కేరళలోని కొచ్చి వేదికగా శుక్రవారం జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలంలో నికోలస్ పూరన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.16 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. దాంతో అంతా ఆశ్చర్యపోయారు.
అట్టర్ ఫ్లాఫ్ అయినా..
ఐపీఎల్ 2021 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున 12 మ్యాచ్‌ల్లో 85 పరుగులు చేసి దారుణంగా విఫలమైన పూరన్‌ను ఐపీఎల్ 2022 వేలంలో రూ.10.75 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ మూల్యం చెల్లించుకుంది. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో పూరన్ 306 పరుగులు మాత్రమే చేయడంతో వేలంలోకి వదిలేసింది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లోనూ పూరన్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో వెస్టిండీస్ ఎన్నడూ లేని విధంగా క్వాలిఫయర్స్‌లోను ఇంటిదారి పట్టింది. దాంతో పూరన్‌ను బేస్ ప్రైజ్‌కు కూడా కోనడం దండుగేనని అంతా భావించారు. కానీ లక్నో సూపర్ జెయింట్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీపడి మరీ ఈ వెస్టిండీస్ కెప్టెన్‌ను రూ.16 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ వేలంలో అత్యధిక ధర పలికిన నాలుగో ఆటగాడిగా పూరన్ నిలిచాడు.
గతం ఎవడికి కావాలి..?
అయితే పూరన్‌ను తీసుకోవడానికి గల కారణాన్ని గంభీర్ తెలియజేశాడు. యాక్షన్ బ్రేక్‌లో డిజిటల్ బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన గంభీర్.. పూరన్ కోసం రూ.16 కోట్లు ఖర్చు చేయడాన్ని సమర్థించుకున్నాడు. 'గత ఐపీఎల్ సీజన్‌లో పూరన్ ఎలా ఆడాడనేది మేం ఆలోచించడం లేదు. అతని సామర్థ్యంపై ఉన్న నమ్మకంతోనే కొనుగోలు చేశాం. పూరన్ లాంటి సత్తా ఉన్న ఆటగాడు కావాలనే ప్రణాళికతో వేలానికి వచ్చాం. అతని వయసు 27 ఏళ్లే. ఇక్కడి నుంచి అతని కెరీర్ జోరు అందుకుంటుంది. ఎన్ని పరుగులు చేశామా? అనేది ముఖ్యం కాదు. ఎంత ప్రభావం చూపగలమనేదే ముఖ్యం.
బేస్ ప్రైజ్‌కే చిక్కారు..
అతను 3-4 మ్యాచ్‌లు గెలిపిస్తే చాలు. ఆ సత్తా అతనికి ఉంది. టాప్-4తో పాటు 6-7 స్థానాల్లో ఆడగలిగే సత్తా ఎంతమంది ఆటగాళ్లకు ఉంది. నికోలస్ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. పూరన్ వికెట్ కీపర్ అయిన మా ఫస్ట్ చాయిన్ కీపర్ క్వింటన్ డికాక్. అతని బ్యాకప్ కీపర్‌గా పూరన్ ఉంటాడు. పూరన్‌కు రూ.16 కోట్లు పెట్టిన మేం లక్కీగా మాకు కావాల్సిన మిగతా ఆటగాళ్లను వారి బేస్ ప్రైజ్‌కే కొనుగోలు చేశాం. ఉనాద్కత్, డానియల్ సామ్స్, రొమారియో షెఫర్డ్‌లు బేస్‌ప్రైజ్‌కే దక్కారు'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications