Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: సహనం కోల్పోయిన నెహ్రా.. హార్దిక్ పాండ్యాతో గొడవకు దిగిన గుజరాత్ కోచ్! (వీడియో)

అహ్మదాబాద్: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ ఆశిష్ నెహ్రా సహనం కోల్పోయాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ గేమ్‌పై చాలా ఫోకస్‌గా ఉండే నెహ్రా ఫస్ట్‌టైమ్ ఫ్రస్టేషన్‌లో కనిపించాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమవడంతో నెహ్రా ఆగ్రహానికి గురయ్యాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఆరంభంలోనే సాహా వికెట్ కోల్పోయింది. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. అద్భుత భాగస్వామ్యంతో టైటాన్స్ ఓ దశలో 147/1తో పటిష్టంగా కనిపించింది. వారిద్దరూ ఆడిన తీరు చూస్తే.. టైటాన్స్ తేలిగ్గా 220 పరుగులు చేసేలా కనిపించింది. కానీ సాయి సుదర్శన్ ఔటయ్యాక గుజరాత్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.

 Ashish Nehra

అయినా సరే మరో ఎండ్‌లో పాతుకుపోయిన గిల్ ఐపీఎల్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. గిల్ శతకం చేశాక సంబరాలు చేసుకుంటుండగా.. గుజరాత్ టైటాన్స్ సభ్యులంతా లేచి నిలబడి చప్పట్లతో అతన్ని అభినందించారు. కానీ నెహ్రా మాత్రం సీట్లోనే కూర్చుండిపోయాడు. గిల్‌ సెంచరీని నెహ్రా సెలబ్రేట్ చేసుకోకపోవడం కామెంటేటర్లను ఆశ్చర్యపరిచింది.

అంతేకాకుండా హార్దిక్ పాండ్యా చాలా సీరియస్‌గా మాట్లాడుతూ.. బ్యాటింగ్ తీరుపై కేకేలు వేయడం కూడా అందర్నీ విస్మయానికి గురిచేసింది. జట్టు నుంచి నెహ్రా ఎక్కువగా ఆశించడమే దీనికి కారణం కావచ్చని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇన్నింగ్స్ అనంతరం హార్దిక్‌తో నెహ్రా గొడవపడినట్లు కనిపించింది. నెహ్రా అక్కడి నుంచి వెళ్లాక.. గుజరాత్ టైటాన్స్ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి.. హార్దిక్‌కు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు.

చివరకు సూపర్ బౌలింగ్‌తో 34 పరుగుల తేడాతో గెలిచిన గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్‌‌కు దూసుకెళ్లింది. గుజరాత్ టైటాన్స్ తమ తదుపరి మ్యాచ్‌ను ఆర్‌సీబీతో మే 21న ఆడనుంది.

Story first published: Tuesday, May 16, 2023, 15:33 [IST]
Other articles published on May 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+