Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: రూ. 30 వేల కుర్చీతో ఫ్యాన్స్‌కు ముంబై ఇండియన్స్ కుచ్చు టోపీ!

న్యూఢిల్లీ: ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ అయిన ముంబై ఇండియన్స్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'కాదేదీ వ్యాపారానికి అనర్హం'అనే రీతిలో ముంబై ఇండియన్స్ భారీ మోసానికి తెర లేపడాన్ని ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. ఐపీఎల్ జరుగుతున్నప్పుడు ఫ్రాంచైజీలు ఆన్‌లైన్ వేదికగా టీమ్స్ జెర్సీలు, టీషర్ట్స్, ఆటగాళ్ల కిట్స్‌కు సంబంధించిన వస్తువులు అమ్మడం, ఇతర బ్రాండ్స్ ప్రమోట్ చేయడం సహజం. కానీ ముంబై ఇండియన్స్ నయా ప్రొడక్ట్స్‌ను లాంఛ్ చేస్తూ కొత్త వ్యాపారానికి తెరలేపింది.

తాజాగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ.. టీమ్ పేరిట ఓ చైర్‌ను లాంఛ్ చేసింది. ఆన్‌లైన్ వేదికగా ఈ కుర్చీలను అందుబాటులోకి తెచ్చిన ఫ్రాంచైజీ.. ఒక్కోదాని ధర రూ.29,999గా నిర్ణయించింది. ముంబై ఇండియన్స్ అభిమానాన్ని, క్రేజ్‌ను క్యాష్ చేసుకునే దిశగా ఆన్‌లైన్ మార్కెట్‌ను విస్తరిస్తోంది. ఈ కుర్చీ వివరాలను ముంబై ఇండియన్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలతో పాటు వెబ్‌సైట్స్‌లో పంచుకుంది.

IPL 2023: Ambanis launch Mumbai Indians Chair for Rs 29k, Fans go bizzare

అయితే ఈ ప్రకటనపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులను దోచుకునేందుకు ముంబై ఇండియన్స్ సిద్దమైందని మండిపడుతున్నారు. రూ.8 వేలు ఉండే కుర్చీని రూ. 30 వేలకు అమ్ముతూ సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడుతున్నారు. జట్టుపై ఉండే అభిమానంతో ఈ కుర్చీని కొనుగోలు చేసే వారుంటారని గ్రహించి.. ఈ వ్యాపారానికి తెరలేపిందని, ఇది అభిమానులను దారుణంగా మోసం చేయడమేనని ట్విటర్ వేదికగా కామెంట్ చేస్తున్నారు.

ఐపీఎల్ 2023 సీజన్ ద్వారా వచ్చే డబ్బులు చాలవన్నట్లు ఫ్రాంచైజీ కక్కుర్తి పడుతూ అభిమానులను మోసం చేసే ప్రణాళిక చేస్తుందని మండిపడుతున్నారు. సెంట్రల్ పూల్ మనీ నుంచి బీసీసీఐ ఇచ్చే డబ్బులతో పాటు ఇతర ఒప్పందాలు, గేట్ రెవెన్యూ ద్వారా ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు ఆర్జిస్తాయి. ఇందులో నుంచి జట్టు అవసరాలు, ఆటగాళ్ల జీతాలు పోయినా.. భారీ మొత్తంలో డబ్బు మిగులుతోంది. అంతేకాకుండా టీమ్ బ్రాండ్ వాల్యూ కూడా చాలా పెరుగుతుంది. ఈ లాభం సరిపోదన్నట్లు ముంబై.. కక్కుర్తి పనులు చేస్తుందని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దయచేసి అభిమానులు ఎవరూ ముంబై ఇండియన్స్ కొత్తగా లాంచ్ చేసిన కుర్చీలను కొనవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఐపీఎల్ 2023 సీజన్‌ను ముంబై ఇండియన్స్ ఓటమితోనే ప్రారంభించిన విషయం తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తదుపరి మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌తో మార్చి 8న ఆడనుంది.

Story first published: Wednesday, April 5, 2023, 18:37 [IST]
Other articles published on Apr 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+