Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్.. కన్ఫామ్ చేసిన కావ్య పాప!

IPL 2023: Aiden Markram Named New Captain Of Sunrisers Hyderabad

హైదరాబాద్: అందరూ ఊహించినట్లుగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్‌రమ్ ఎంపికయ్యాడు. ఈవిషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ట్విటర్ వేదికగా వెల్లడించింది. బుధవారమే తమ కొత్త కెప్టెన్ ఎవరో చెబుతామని ట్వీట్ చేసిన సన్‌రైజర్స్.. 24 గంటల సస్పెన్స్‌కు తెరదించుతూ..

మార్కర్‌మ్ తమ నూతన సారథిగా ప్రకటించింది. చాలా వినూత్నంగా తమ కెప్టెన్ పేరును వెల్లడించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గురించి ట్విటర్ వేదికగా జరిగిన చర్చను.. ట్వీట్స్ స్క్రీన్ షాట్స్‌లతో మార్కరమ్ స్కెచ్ రూపొందించింది. దీనికి తమ నూతన సారథి మార్క్‌రమ్‌కు హాలో చెప్పండని క్యాప్షన్‌గా పేర్కొంది.

సౌతాఫ్రికా టీ20 లీగ్ విజయంతో..

కొన్నేళ్ల పాటు డేవిడ్ వార్నర్, ఆపై కేన్‌ విలియమ్సన్‌ సన్‌రైజర్స్‌ను నడిపించగా.. ఈ ఇద్దరూ ఆ జట్టుకు దూరమయ్యారు. డేవిడ్ వార్నర్‌ గత సీజన్లోనే సన్‌రైజర్స్‌ను వీడగా.. ఈ సీజన్‌కు ముందు విలియమ్సన్‌ను సన్‌రైజర్స్‌ వదులుకుంది. దాంతో జట్టుకు సారథి అవసరమవ్వగా.. మార్క్‌రమ్‌కు ఆ బాధ్యతలను అప్పగించింది. ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్‌ను మార్క్‌రమ్ ఛాంపియన్‌గా నిలబెట్టాడు. దాంతో మార్క్‌రమ్‌కు ప్రమోషన్ ఇస్తూ తమ ప్రధాన టీమ్ సారథ్య బాధ్యతలను అప్పగించింది.

మయాంక్ అగర్వాల్‌ను వెనక్కు నెట్టి..

మయాంక్ అగర్వాల్‌ను వెనక్కు నెట్టి..

వాస్తవానికి మయాంక్ అగర్వాల్‌కు సారథ్య బాధ్యతలు దక్కుతాయని అంతా భావించినా.. సౌతాఫ్రికా టీ20 లీగ్ విజయంతో మార్క్‌రమ్ అతన్ని వెనక్కినెట్టాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆరంభంలో వరుస పరాజయాలు ఎదురైనా.. జట్టులోని ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా తనదైన సారథ్యంలో టీమ్‌ను సెమీఫైనల్‌కు చేర్చాడు. ఇక నాకౌట్ మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా ముందుండి అద్భుత సెంచరీతో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఫైనల్లోనూ తన వంతుగా రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీ‌లో 366 పరుగులతో పాటు 11 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ద టోర్నీ అవార్డు కూడా అందుకున్నాడు.

ఆల్‌రౌండ్ ప్రదర్శనతో..

ఆల్‌రౌండ్ ప్రదర్శనతో..

ఈ టోర్నీలో మొత్తం 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 19 పాయింట్లతో సెమీ ఫైనల్ బెర్త్ దక్కించుకున్న సన్‌రైజర్స్.. సెమీఫైనల్‌లో సీఎస్‌కేకు చెందిన జోబర్గ్ సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఎయిడెన్ మార్క్‌రమ్ సెంచరీతో చెలరేగి జట్టును ఫైనల్ చేర్చాడు. 2014‌‌లో సౌతాఫ్రికా కెప్టెన్‌గా అండర్ 19 ప్రపంచకప్‌ను గెలిపించాడు. దాంతోనే మార్కరమ్‌కు హైదరాబాద్ పగ్గాలు అప్పగించారు. మార్క్‌రమ్ సారథ్యంలో హైదరాబాద్ ఈసారి టైటిల్ గెలుస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Thursday, February 23, 2023, 11:49 [IST]
Other articles published on Feb 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+