Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: జాక్‌పాట్ కొట్టేసిన మార్క్‌రమ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ప్రమోషన్!

IPL 2023: Aiden Markram joins SRH skipper race after Sunrisers Eastern won the first edition of SA20

హైదరాబాద్: సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ ఎయిడెన్ మార్క్‌రమ్ జాక్‌పాట్ కొట్టేసాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ప్రమోషన్ అందుకోనున్నాడు. అప్‌కమింగ్ ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్ క్యాప్ జట్టును నడిపించిన మార్క్‌రమ్ విజేతగా నిలబెట్టాడు.

అరంగేట్ర సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అసాధారణ కెప్టెన్సీతో పాటు వ్యక్తిగతంగా రాణించి జట్టుకు టైటిల్ అందించాడు. ఆరంభంలో వరుస పరాజయాలు ఎదురైనా.. జట్టులోని ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా తనదైన సారథ్యంలో టీమ్‌ను సెమీఫైనల్‌కు చేర్చాడు.

366 రన్స్..11 వికెట్లు..

366 రన్స్..11 వికెట్లు..

ఇక నాకౌట్ మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా ముందుండి అద్భుత సెంచరీతో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఫైనల్లోనూ తన వంతుగా రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీ‌లో 366 పరుగులతో పాటు 11 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ద టోర్నీ అవార్డు కూడా అందుకున్నాడు.

ఈ టోర్నీలో మొత్తం 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 19 పాయింట్లతో సెమీ ఫైనల్ బెర్త్ దక్కించుకున్న సన్‌రైజర్స్.. సెమీఫైనల్‌లో సీఎస్‌కేకు చెందిన జోబర్గ్ సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఎయిడెన్ మార్క్‌రమ్ సెంచరీతో చెలరేగి జట్టును ఫైనల్ చేర్చాడు. 2014‌‌లో సౌతాఫ్రికా కెప్టెన్‌గా అండర్ 19 ప్రపంచకప్‌ను గెలిపించాడు.

మార్క్‌రమ్ తదుపరి కెప్టెన్‌గా..

మార్క్‌రమ్ తదుపరి కెప్టెన్‌గా..

సూపర్ ప్రదర్శనతో ఆకట్టుకొని జట్టుకు టైటిల్ అందించిన ఎయిడెన్ మార్క్‌రమ్‌కు సన్‌రైజర్స్ యాజమాన్యం ప్రమోషన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సౌతాఫ్రికా లీగ్‌లో కెప్టెన్‌గా ఆటగాడిగా రాణించిన మార్క్‌రమ్‌ను.. ఐపీఎల్‌లో కూడా కెప్టెన్‌గా కొనసాగించాలని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని టీమ్ ఓనర్ కావ్యమారన్‌కు కూడా తెలిపినట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి. గత సీజన్‌లో జట్టును నడిపించిన కేన్ విలియమ్సన్‌పై వేటు వేసిన సన్‌రైజర్స్.. మినీ వేలంలో హరీ బ్రూక్, మయాంక్ అగర్వాల్‌లకు భారీ మొత్తంలో చెల్లించి జట్టులోకి తీసుకుంది.

మయాంక్ అగర్వాల్‌తో పోటీ..

మయాంక్ అగర్వాల్‌తో పోటీ..

ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పోస్ట్ ఖాళీగా ఉండగా.. ఎయిడెన్‌ మార్క్‌రమ్, మయాంక్ అగర్వాల్, భువనేశ్వర్ కుమార్, అభిషేక్ శర్మలు కెప్టెన్సీ రేసులో ఉన్నారు. అత్యంత సీనియర్ అయిన భువనేశ్వర్ కుమార్‌కు కెప్టెన్సీ ఇవ్వాలని ఉన్నా అతని వయసు, ఫిట్‌నెస్ సమస్యలు ప్రతికూలంగా మారాయి.

మయాంక్ అగర్వాల్‌కు సారథ్యం కట్టబెడదామనుకుంటే పంజాబ్ కింగ్స్ తరఫున సారథిగా అతను అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. అభిషేక్ శర్మకు అంతగా అనుభవమే లేదు. ఈ పరిస్థితుల్లో మార్క్‌రమ్ టైటిల్ గెలిపించడంతో అతన్నే కెప్టెన్ చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ వచ్చినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే మార్క్‌రమ్‌ను తమ తదుపరి కెప్టెన్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని జట్టు వర్గాలు పేర్కొన్నాయి.

ఫైనల్లో 4 వికెట్లతో విజయం..

ఫైనల్లో 4 వికెట్లతో విజయం..

ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన ప్రిటోరియా క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన సన్‌రైజర్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్.. 19.3 ఓవర్లలో 135 పరుగులకు కుప్పకూలింది. కుశాల్ మెండీస్(21), రిలీ రోసౌ(19), జేమ్స్ నీషమ్(19) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

సన్‌రైజర్స్ బౌలర్లలో వాన్‌డెర్ మెర్వే నాలుగు వికెట్లతో క్యాపిటల్స్ పతనాన్ని శాసించగా.. సిసండా మగల, బార్టమాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మార్కో జాన్సెన్, ఎయిడెన్ మార్క్‌రమ్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 16.2 ఓవర్లలోనే 137 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్ ఆడమ్ రోసింగ్టన్(30 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(26), జోర్డాన్ హెర్మాన్(22) ఫర్వాలేదనిపించారు. మార్కో జాన్సెన్(13 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Monday, February 13, 2023, 12:02 [IST]
Other articles published on Feb 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+