IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి మయాంక్ అగర్వాల్..!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 మినీ వేలానికి రంగం సిద్దమైంది. మరో 72 గంటల్లో కొచ్చి వేదికగా ఆటగాళ్ల వేలం ప్రారంభం కానుంది. డిసెంబర్ 23న మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ కార్యక్రమానికి తెరలేవనుండగా.. 405 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 991 మంది ఆటగాళ్లు మినీ వేలానికి రిజిస్టర్ చేసుకోగా.. ఫ్రాంచైజీలు 405 మంది ఆటగాళ్ల పేర్లను షార్ట్‌లిస్ట్ చేశాయి. ఇందులో గరిష్టంగా 88 మంది ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. ఇక పెద్ద మొత్తంలో పర్స్ మనీ ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలంలో ఎవర్ని దక్కించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
రిటెన్షన్ ప్రక్రియలో చాలా మందిని వదులుకున్న ఆరెంజ్ ఆర్మీ.. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను కూడా వేలంలోకి విడిచి పెట్టింది. అయితే మళ్లీ అతన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తుందా? లేక వదిలేస్తుందా? అనేది వేలంలోనే తేలనుంది.

పఠాన్, చోప్రా..
ప్రస్తుతానికైతే సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా అయితే ఎవర్నీ నియమించలేదు. దాంతో మయాంక్ అగర్వాల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంజాబ్ కింగ్స్ సారథిగా ఉన్న మయాంక్ అగర్వాల్‌ను ఆ జట్టు వేలంలోకి వదిలేసిన విషయం తెలిసిందే. దాంతో అతన్ని కొనుగోలు చేయాలని కావ్య మారన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రణాళికలు రచిస్తోంది. మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, ఆకాశ్ చోప్రా సైతం మయాంక్ అగర్వాల్‌ను సన్‌రైజర్స్ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

కెప్టెన్‌గా నియమించే అవకాశం..
'సన్‌రైజర్స్ మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేసుకుంటుంది. ఎందుకంటే ఆ జట్టుకు దూకుడుగా ఆడే ఓపెనర్ అవసరం. చాలా ఏళ్ల పాటు జట్టును ముందుకు నడిపిన కేన్ విలియమ్సన్ కూడా ఇప్పుడు సన్‌రైజర్స్‌లో లేడు. మయాంక్ అగర్వాల్‌కు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉంది. అతను స్వేచ్ఛగా షాట్లు ఆడగలడు. భయం లేకుండా.. స్వార్థం లేకుండా ఆడగలడు. మయాంక్ అగర్వాల్‌ను తమ కెప్టెన్‌గా నియమించే యోచనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉండొచ్చు'అని అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.

పంజాబ్ కింగ్స్ వేటు వేయడంతో..
వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం మయాంక్ అగర్వాల్ స్థానంలో శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా నియమించిన పంజాబ్ కింగ్స్.. మయాంక్ అగర్వాల్‌ను వేలానికి వదిలేసింది. మయాంక్ అగర్వాల్ గతంలో ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, రైజింగ్ పుణే సూపర్ గెయింట్ తరఫున ఆడాడు. ఈ వేలంలో తొలి సెట్లో మయాంక్ పేరుంది. సన్‌రైజర్స్ జట్టులో ప్రస్తుతం అబ్దుల్ సమద్, ఎయిడన్ మర్‌క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్ రూపంలో బ్యాటర్లు ఉండగా.. అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్ రూపంలో స్పిన్ ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు.

ఓపెనర్‌గా..
మయాంక్‌ను జట్టులోకి తీసుకుంటే.. అతడితోపాటు రాహుల్ త్రిపాఠి లేదా అభిషేక్ ఓపెనర్లుగా బరిలో దిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ సన్‌రైజర్స్‌కు ఎక్కువ మ్యాచ్‌ల్లో విదేశీ ఆటగాళ్లే ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఒకప్పుడు వార్నర్, బెయిర్‌స్టో, విలియమ్సన్ లాంటి విదేశీ బ్యాటర్లు సన్‌రైజర్స్ టాప్ ఆర్డర్‌లో ఆడారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications