Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: ఈసారైనా ముంబై ఇండియన్స్ రికార్డులు బద్దలయ్యేనా..?

IPL 2023: 6 Records That Prove Mumbai Indians Is The Greatest Team Ever

హైదరాబాద్: ఐపీఎల్‌‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ఏదైనా ఉందా? అంటే అది ముంబై ఇండియన్సే. ఇప్పటికే ఐదు టైటిళ్లు గెలిచిన ఆ జట్టు.. ఆరో టైటిల్‌పై కన్నేసింది. ఐపీఎల్ 2022 మెగా వేలంతో కాస్త బలహీన పడినా.. గత సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబర్చినా.. మళ్లీ సత్తా చాటేందుకు సిద్దమవుతోంది. అయితే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు మాత్రమే సాధ్యమైన కొన్ని రికార్డులున్నాయి. ఈ సారైన వాటిని ఇతర ఫ్రాంచైజీలు అధిగమిస్తాయో లేదో చూడాలి.

1. అత్యధిక విజయాలు..

16 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఇప్పటివరకు 186 మ్యాచ్‌లు ఆడిన ముంబై అందులో 108 మ్యాచ్‌లు గెలుపొందింది. ఐపీఎల్‌ చరిత్రలో 100 లీగ్‌ మ్యాచ్‌లు గెలిచిన ఏకైక జట్టుగా ముంబై మాత్రమే. కొనసాగుతోంది.

2. భారీ విజయం

ఐపీఎల్‌లో భారీ పరుగుల తేడాతో గెలిచిన జట్టు కూడా ముంబై ఇండియన్సే. 2017లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంబై ఇండియన్స్ 146 పరుగుల భారీ తేడాతో ఓడించింది.

3. అత్యధిక టైటిళ్లు..

ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఐదు ట్రోఫీలు గెలుచుకుంది. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో చాంపియన్‌గా నిలిచింది. ఇప్పటి వరకు నాలుగు టైటిళ్లు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ముంబై రికార్డును సమం చేసే అవకాశం ఉంది.

4. అత్యధిక మెయిడిన్ ఓవర్లు..

ఐపీఎల్‌లో ముంబై బౌలర్లు 40 మెయిడిన్‌ ఓవర్లు వేశారు. బ్యాటర్లు 1308 సిక్స్‌లు బాదగా, 2980 ఫోర్లు కొట్టారు. ఐపీఎల్‌ చరిత్రలో ఇదే అత్యధికం.

5. ఫాస్టెస్ట్ చేజింగ్..

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ ఛేజింగ్‌ కూడా ముంబై ఇండియన్స్‌దే. 87 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా మీద 2008లో గెలుపొందింది.ఇక చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో గత పదేళ్లుగా ముంబైని ఓడించిన జట్టే లేదు. ఆడిన ప్రతి మ్యాచ్‌లో విజయఢంకా మోగించింది.

6. సెంచరీ బౌలర్లు..

వందకు పైగా వికెట్లు పడగొట్టిన ముగ్గురు బౌలర్లు ముంబై జట్టులోనే ఉన్నారు. లసిత్‌ మలింగ (122 వికెట్లు), హర్భజన్‌ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా (120)ఈ ఫీట్ సాధించారు. ఒక ఇన్నింగ్స్‌లో బెస్ట్‌ బౌలింగ్‌ ఫిగర్స్‌ కూడా ముంబై బౌలర్‌దే కావడం విశేషం. అల్జారీ జోసెఫ్‌ 2019లో హైదరాబాద్‌ మీద 6/12తో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు.

Story first published: Wednesday, March 29, 2023, 17:07 [IST]
Other articles published on Mar 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+