Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: నయా రూల్స్‌తో సరికొత్తగా ఐపీఎల్.. ఆకట్టుకునే 5 అంశాలివే!

 IPL 2023: 5 Interesting Facts About Indian Premier League Season 16

క్రికెట్‌ అభిమానుల్ని ఉర్రూతలూగించే మ్యాచ్‌లు.. స్టేడియం పైకప్పులను తాకే సిక్సర్లు.. వికెట్లను గాల్లోకి గిరాటేసే యార్కర్లు.. మైమరిపించే క్యాచ్‌లు.. ఒక్కటా..! రెండా..? ఎన్నో..! మరెన్నో..? దాదాపు రెండు నెలలపాటు ప్రేక్షకుల్ని అలరించే ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL) మళ్లీ వచ్చేసింది. ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా 15 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ 16 వ సీజన్ మార్చి 1‌న ప్రారంభంకానుంది. ఈ వరల్డ్ ఫేమస్ లీగ్ టైటిల్ కోసం 10 జట్లు నువ్వా-నేనా? అన్నట్లు తలపడనున్నాయి. సీజన్ సీజన్‌కు కొత్త పుంతలు తొక్కుతున్న ఐపీఎల్.. ఈ సారి కూడా నయా రూల్స్‌తో సరికొత్తగా అభిమానులను అలరించనుంది. ముఖ్యంగా ఓ ఐదు అంశాలు అభిమానులను ఆకట్టుకోనున్నాయి.

సొంతమైదానాల్లో మ్యాచ్‌లు

సొంతమైదానాల్లో మ్యాచ్‌లు

కరోనా మహమ్మారి కారణంగా గత మూడు సీజన్లు బయో బబుల్ వేదికగా పరిమితమైన వేదికల్లోనే జరగాయి. దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2020, 21 సీజన్ జరగ్గా.. 2022 మాత్రం ముంబైలోని నాలుగు వేదికలుగా నిర్వహించారు. ప్లే ఆఫ్స్ కోల్‌కతా వేదికగా.. ఫైనల్ అహ్మదాబాద్ వేదికగా జరిపారు. కానీ ఈ సారి పాత పద్దతిలో హోమ్ అండ్ అవే ఫార్మాట్‌లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ప్రతీ జట్టు సొంతమైదానంలో 7 మ్యాచ్‌లు.. అవే వేదికల్లో మరో 7 మ్యాచ్‌లు ఆడనున్నాయి. తమ అభిమాన ఫ్రాంచైజీ మ్యాచ్‌లను ప్రేక్షకులు ఈసారి ప్రత్యక్షంగా చూడవచ్చు.

వైడ్/నోబాల్‌కు రివ్యూ..

వైడ్/నోబాల్‌కు రివ్యూ..

ఈ సారి ప్రతీ జట్టుకు మూడు రివ్యూలు కేటాయించారు. వైడ్, నోబాల్‌కు కూడా రివ్యూ తీసుకోవచ్చు. ఇప్పటికే ఈ నిబంధనను వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తున్నారు. గతంలో వైడ్, నోబాల్స్ విషయంలో అంపైర్లు తీసుకున్న నిర్ణయాలు మ్యాచ్ ఫలితాలను శాసించడంతో పాటు తీవ్ర విమర్శలకు దారితీసాయి. ఈ క్రమంలోనే వైడ్, నోబాల్స్‌కు రివ్యూ తీసుకునే అవకాశం కల్పించారు.

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్

ఈసారి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం తుది జట్టులో లేని ఓ ఆటగాడిని మ్యాచ్ ప్రారంభమయ్యాక బరిలోకి దించవచ్చు. అతను బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయవచ్చు. మ్యాచ్ పరిస్థితులను బట్టి ఈ నిర్ణయం తీసుకోవచ్చు. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే ఈ ఇంపాక్ట్ ప్లేయర్‌ పేరును అంపైర్లకు వెళ్లడించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లోనే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్ జట్టులోకి వస్తే బయటి వెళ్లిన ప్లేయర్ మళ్లీ ఆడటానికి వీలు ఉండదు. ఈ రూల్‌తో ఆట రసవత్తరంగా మారి అభిమానులను మరింత అలరించనుంది.

 ధోనీ వీడ్కోలు మ్యాచ్

ధోనీ వీడ్కోలు మ్యాచ్

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి సీజన్ కానుంది. సొంత అభిమానుల మధ్య వీడ్కోలు పలుకుతానని గత సీజన్ సందర్భంగా ధోనీ వెల్లడించాడు. చెన్నైలో చెపాక్ వేదికగా జరిగే చివరి మ్యాచ్‌తో ధోనీ ఆటకు వీడ్కోలు పలకనున్నాడు. ఈ సీజన్‌లో ఇది కూడా ఓ ఆసక్తికరమైన విషయం.

 ఫ్రీగా ధనాధన్ మ్యాచ్‌లు

ఫ్రీగా ధనాధన్ మ్యాచ్‌లు

ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా వీక్షించవచ్చు. ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న రిలయన్స్ సంస్థ వయోకామ్.. జియో సినిమా యాప్ ద్వారా జియో యూజర్లకు ఫ్రీగా ప్రత్యక్ష ప్రసారం అందివ్వనుంది. ఇప్పటికే డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లను సరికొత్త టెక్నాలజీతో అందిస్తోంది. ఇక ఐపీఎల్‌కు మరిన్నీ సేవలను అందించనుంది.

Story first published: Friday, March 17, 2023, 19:12 [IST]
Other articles published on Mar 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+