IPL 2023: ఈ అండర్ రేటేడ్ ఆర్‌సీబీ ఆటగాళ్లతో ప్రత్యర్ధులకు చుక్కలే!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) పెద్దగా మార్పులేమి చేయలేదు. కోర్ టీమ్ మొత్తాన్ని రిటైన్ చేసుకున్న బెంగళూరు.. ఐదుగురి ఆటగాళ్లను మాత్రమే వదిలేసింది. గత సీజన్‌లో టీమ్ పెర్ఫెమెన్స్‌పై సంతృప్తిగా ఉన్న ఆ జట్టు.. అదే జోరును అప్‌కమింగ్ సీజన్‌లోను కొనసాగించాలనుకుంటుంది. అయితే ఏళ్లు గడుస్తున్నా.. ఆ జట్టు టైటిల్ నిరీక్షణ మాత్రం తీరడం లేదు.
కెప్టెన్ మారినా.. జట్టులో మార్పులు చేసినా టైటిల్ మాత్రం దక్కడం లేదు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫాఫ్ డుప్లెసిస్ నాయకత్వంలో దుమ్మురేపిన ఆర్‌సీబీ దురదృష్టవశాత్తు ప్లే ఆఫ్స్‌లో ఓటమిపాలై మూడో స్థానంలో నిలిచింది. ఈ సారి ఎలాగైన టైటిల్ గెలవాలని భావిస్తోంది. అయితే ఆ జట్టులోని ముగ్గురు అనామక ఆటగాళ్లు.. అప్‌కమింగ్ సీజన్‌లో కీలకం కానున్నారు.

రజత్ పటీదార్
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా నిలిచిన రజత్ పటీదార్.. అనూహ్యంగా ఆర్‌సీబీలో చేరాడు. లువ్‌నిత్ సిసోడియా గాయపడటంతో రిప్లేస్‌మెంట్‌గా జట్టులోకి వచ్చిన పటీదార్.. సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 8 మ్యాచ్‌ల్లో 55.5 సగటుతో 333 పరుగులు చేశాడు. లక్నోసూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో చెలరేగాడు.
టీమ్ మొత్తం విఫలమైన వేళ రజత్ పటీదార్ కనబర్చిన పోరాటం అందర్నీ ఆకట్టుకుంది. ఎంతలా అంటే ఈ ఒక్క పెర్ఫామెన్స్‌తో అతను టీమిండియా పిలుపును కూడా అందుకున్నాడు. భారత్-ఏ తరఫున కూడా నిలకడగా రాణించాడు. దేశవాళీ క్రికెట్‌లోనూ సత్తా చాటాడు. దాంతో ఆర్‌సీబీ మరో ఆలోచన లేకుండా పటీదార్‌ను రిటైన్ చేసుకుంది. అప్‌కమింగ్ సీజన్‌లో అతను ఆర్‌సీబీకి కీలకం కానున్నాడు.

డేవిడ్ విల్లే..
ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఈ ఇంగ్లండ్ పేసర్‌ను ఆర్‌సీబీ రూ.2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసింది. అతన్ని కేవలం బ్యాకప్ ఆప్షన్‌గా మాత్రమే వాడుకుంది. దాంతో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన డేవిడ్ విల్లే 6.55 ఎకానమీతో ఓ వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న డేవిడ్ విల్లే 18 పరుగులు మాత్రమే చేశాడు. అతన్ని ఆర్‌సీబీ తక్కువ అంచనా వేయడం.. సరైన అవకాశాలు ఇవ్వకపోవడంతో నిరూపించుకోలేకపోయాడు. అయితే ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చాంపియన్‌గా నిలవడంలో డేవిడ్ విల్లే కీలక పాత్ర పోషించాడు. నిలకడగా వికెట్లు తీయడంతో పాటు కట్టడిగా బౌలింగ్ చేశాడు.
లోయరార్డర్‌లో బ్యాట్ కూడా ఝులిపించాడు. ఇక ఆర్‌సీబీ జట్టులో ఉన్న ఏకైక లెఫ్టార్మ్ పేసర్ కూడా విల్లేనే కావడం విశేషం. అయితే నలుగురు ఓవర్‌సీస్ ప్లేయర్లను మాత్రమే ఆడించాలనే నిబంధన విల్లేకు అవకాశం ఇవ్వకుండా చేస్తోంది. ఫాఫ్ డుప్లెసిస్, జోష్ హజెల్ వుడ్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, వానిందు హసరంగాలతో ఆర్‌సీబీ ఓవర్‌సీస్ స్లాట్ నిండిపోయింది. ఎవరైన గాయపడితేనే ఈ ఇంగ్లీస్ బ్యాటర్‌కు చోటు దక్కనుంది. అవకాశం వస్తే మాత్రం విల్లే సత్తా చాటగలడు.

మహిపాల్ లోమ్రోర్
మిడిలార్డర్‌లో స్పిన్ హిట్టింగ్ ఆల్‌రౌండర్ లేక ఆర్‌సీబీ గత సీజన్‌లో ఇబ్బంది పడింది. ఫాఫ్ డుప్లెసిస్, కోహ్లీ సైతం లెఫ్టార్మ్, లెగ్ స్పిన్ ఆడటంలో తీవ్రంగా తడబడ్డారు. మహిపాల్ లోమ్రోర్ సైతం ఆకట్టుకోలేకపోయాడు. ఏడు మ్యాచ్‌ల్లో 150.88 స్ట్రైక్‌రేట్‌తో 86 పరుగులు చేశాడు. అయితే దేశవాళీ క్రికెట్‌లో లోమ్రోర్ అదరగొట్టాడు. ఈ క్రమంలోనే అతన్ని ఆర్‌సీబీ ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే అతనికి షెహ్‌బాజ్ అహ్మద్‌తో తీవ్ర పోటీ నెలకొంది. అవకాశం వస్తే మాత్రం మహిపాల్ లోమ్రోర్ సత్తా చాటగలడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications