IPL 2023: జట్టులోనే కెప్టెన్ ఉండగా టెన్షన్ ఎందుకు కావ్య పాప!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 మినీ వేలానికి రంగం సిద్దమైంది. మరో 48 గంటల్లో ఈ మినీ ఆక్షన్‌కు తెరలేవనుంది. కేరళలోని కొచ్చి వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ మినీ వేలం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీల పెద్దలు మెగా వేలం కోసం కొచ్చి చేరుకున్నారు. జట్టులోని బలహీనతలను అధిగమించడంపై ఫోకస్ పెట్టిన ఫ్రాంచైజీలు అందుకు తగ్గ వ్యూహాలు రచిస్తున్నాయి. సరైన ఆటగాళ్లను తీసుకోవడంతో పాటు ప్రత్యర్థి ఫ్రాంచైజీల పర్స్ మనీని ఎలా ఖాళీ చేయాలా? అనేదానిపై ప్రణాళికలు రచిస్తున్నాయి. అత్యధికంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ దగ్గర రూ.42.25 కోట్లు అందుబాటులో ఉండగా..ఆ జట్టులో 14 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో నలుగురు ఓవర్‌సీస్ ప్లేయర్లను తీసుకోవాల్సి ఉంది.

బెన్ స్టోక్స్ కంటే..
కెప్టెన్ కేన్ విలియమ్సన్‌పైనే వేటు వేసిన సన్‌రైజర్స్ ముందుగా సారథిని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే బెన్ స్టోక్స్‌ను తీసుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. అయితే ఫ్రాంచైజీలన్నీ ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌పై ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో అతను భారీ ధర పలికే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్.. స్టోక్స్‌కు బదులు ఇతర ఆటగాళ్లను తీసుకోవడంపై ఫోకస్ పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా భారత ఆటగాళ్లను తీసుకోవాలని, టాపార్డర్‌లో సత్తా చాటే బ్యాటర్లు జట్టుకు అవసరమని సలహా ఇస్తున్నారు. ఇక జట్టులో ఎయిడెన్ మార్క్‌రమ్, వాషింగ్టన్ సుందర్ రూపంలో కెప్టెన్సీ ఆప్షన్స్ ఉన్నాయని చెబుతున్నారు.

సుందర్ ఉండగా..
వాషింగ్టన్ సుందర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేస్తే జట్టుకు అన్ని విధాల మేలు జరుగుతుందని చెబుతున్నారు. వాషింగ్టన్ సుందర్ బెస్ట్ కెప్టెన్ ఆప్షన్ అనడానికి మూడు బలమైన కారణాలున్నాయంటున్నారు. భారత ప్లేయర్‌ను కెప్టెన్ చేయడం సురక్షితమైన నిర్ణయమని చెబుతున్నారు. ఐపీఎల్‌లో ఓవర్‌సీస్ కెప్టెన్ల సక్సెస్ రేట్ చాలా తక్కువని, డేవిడ్ వార్నర్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్ మినహా మిగతా వాళ్లు పెద్దగా రాణించిందేం లేదని గుర్తు చేస్తున్నారు. 23 ఏళ్ల సుందర్.. ఆల్‌ఫార్మాట్ ప్లేయరని, అతన్ని కెప్టెన్ చేస్తే.. టీమ్ భవిష్యత్తుకు కూడా బాటలు వేసినట్లు అవుందని అభిప్రాయపడుతున్నారు.

అనుభవం కలిగిన ప్లేయర్..
అంతేకాకుండా జట్టులో భువనేశ్వర్ కుమార్ తర్వాత ఐపీఎల్ అనుభవం కలిగిన ప్లేయర్ సుందరేనని గుర్తు చేస్తున్నారు. సుందర్‌కు కెప్టెన్‌గా అవకాశమిస్తే బ్రియాన్ లారా వంటి ఆటగాళ్ల మార్గదర్శకంలో అతను మేటీ ప్లేయర్ అవుతాడని జోస్యం చెబుతున్నారు. కెప్టెన్సీ ఇవ్వడం వల్ల సుందర్‌కు మరింత మోటీవేషన్ లభిస్తుందని, మెరుగ్గా రాణించగలుగుతాడని కామెంట్ చేస్తున్నారు. ఏజ్ క్రికెట్‌లో టాపార్డర్ బ్యాటర్‌గా సత్తా చాటిన సుందర్.. కెప్టెన్ అయితే ఐపీఎల్‌లోనూ రాణిస్తాడని చెబుతున్నారు.

టాపార్డర్ బ్యాటర్‌గానూ..
ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం.. పవర్ ప్లేలో బౌలింగ్ చేసే సత్తా అతని సొంతమని సూచిస్తున్నారు. కెప్టెన్సీ అనుభవం ఆటగాడిగా అతన్ని మరో స్థాయికి తీసుకువెళ్తుందని అభిప్రాయపడుతున్నారు. బ్యాటింగ్, బౌలింగే కాకుండా ఫీల్డింగ్‌లోనూ సుందర్ చురుకుగా ఉంటాడు. అతను బౌలింగ్ గణంకాలే ఎంతటి గొప్ప ఆఫ్ స్పిన్నర్ అనే విషయాన్ని తెలియజేస్తాయి. ఈ క్రమంలోనే సుందర్ ఉండగా కెప్టెన్ కోసం టెన్షన్ ఎందుకు కావ్య పాప అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications