For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023 Mini Auction: ఆ ముగ్గురిపై కన్నేసిన ఆర్‌సీబీ!

IPL 2023: 3 players RCB might be tempted to target in auction

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలో అదరగొట్టిన రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ).. టైటిల్ మాత్రం అందుకోలేకపోయింది. ప్లే ఆఫ్స్‌‌‌లోనే వెనుదిరిగి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఐపీఎల్ 2023 సీజన్ కోసం కోర్ టీమ్‌ మొత్తం అలానే ఉంచుకున్న ఆర్‌సీబీ.. కేవలం ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే వదిలేసింది. దాంతో ఆ జట్టు దగ్గర అతి తక్కువగా రూ.8.75 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ డబ్బులతో ఆర్‌సీబీ దేశవాళీ ఆటగాళ్లనే టార్గెట్ చేయనుంది. ముఖ్యంగా ఓ ముగ్గురు ప్లేయర్లపై ఆర్‌సీబీ కన్నేసింది.

మయాంక్ అగర్వాల్..

మయాంక్ అగర్వాల్..

బెంగళూరు లోకల్ ప్లేయర్.. పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ను తీసుకునేందుకు ఆర్‌సీబీ ఆసక్తికనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అతన్ని తీసుకోవడం వల్ల జట్టుకు లోకల్ ఫ్లెయిర్ యాడ్ అవుతుందని ఆ జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అంతేకాకుండా మయాంక్ అగర్వాల్‌ స్పిన్‌ను సమర్థవంతంగా ఆడగలడు. అయితే మయాంక్ అగర్వాల్‌ ఆర్‌సీబీ బ్యాటింగ్ ఆర్డర్ ఫిట్ అవ్వడు. కోహ్లీ, డుప్లెసిస్, రావత్‌తో టాపార్డర్ బలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అతన్ని తీసుకోవడం వల్ల జట్టుకు వచ్చే ఉపయోగం ఏం లేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్‌సీబీ తమ బలహీనతలను పూడ్చుకోవడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు.

నికోలస్ పూరన్..

నికోలస్ పూరన్..

నికోలస్ పూరన్‌ను తీసుకునేందుకు కూడా ఆర్‌సీబీ ప్రయత్నించే అవకాశాలున్నాయి. స్పిన్ హిట్టింగ్ సామర్థ్యం కలిగిన పూరన్ లెఫ్టాండర్ కావడం.. టాప్-5‌లో అతనిలాంటి క్వాలిటీ బ్యాట్స్‌మన్ ఆర్‌సీబీకి లేకపోవడంతో విండీస్ హిట్టర్‌ను కొనుగోలు చేయవచ్చు. అయితే ఆర్‌సీబీ బడ్జెట్‌లో పూరన్ దొరకడం కష్టం. గతేడాది రూ.10 కోట్లు పలికిన పూరన్.. ఈ సారి రూ.5 కోట్లు అయిన పలికే చాన్స్ ఉంది. అంతేకాకుండా ఆర్‌సీబీ తుది జట్టులో ఓవర్‌సీస్ ప్లేయర్‌కు చోటు లేదు. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, హసరంగా, హజెల్ వుడ్‌తో నాలుగు స్లాట్స్‌ ఫుల్‌గా ఉన్నాయి.

కైల్ జెమీసన్..

కైల్ జెమీసన్..

న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కైల్ జెమీసన్‌ను తీసుకునే ప్రయత్నం ఆర్‌సీబీ మరోసారి చేయవచ్చు. ఐపీఎల్ 2021 వేలంలో జెమీసన్‌కు రూ.14 కోట్లు చెల్లించి చేతులు కాల్చుకున్న ఆర్‌సీబీ.. మరోసారి తక్కువ ధరకు అందుబాటులో ఉంటే అతన్ని తీసుకోవచ్చు. టీమ్ డైరెక్టర్ మైక్ హుస్సెన్ న్యూజిలాండ్‌కు చెందినవాడే కావడంతో ఆ దేశ ఆటగాళ్లను తీసుకునేందుకు ఎక్కువ మొగ్గు చూపవచ్చు. అయితే బెంగళూరుకు సరైన ఫాస్ట్ ఆల్‌రౌండర్ లేడు. ఆ స్థానాన్ని జెమీసన్‌తో భర్తీ చేయాలని ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ముంబైకి ఇచ్చేసిన జాసన్ బెహెండ్రాఫ్ స్థానాన్ని కూడా అతను భర్తీ చేయగలడని ఆ జట్టు అనుకుంటుంది. అయితే జెమీసన్‌కు టీ20ల్లో ఘనమైన రికార్డు లేకపోవడం ప్రతీకూలాంశం. అయితే బ్యాకప్‌గా అయినా అతను పనికివస్తాడని ఆర్‌సీబీ అనుకుంటుంది.

Story first published: Friday, December 9, 2022, 21:11 [IST]
Other articles published on Dec 9, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+