IPL 2023: ఆ ముగ్గురు దిగ్గజాలు వేలంలో పాల్గొంటేనా? డబ్బులే డబ్బులు!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 మెగా వేలానికి రంగం సిద్దమైంది. కేరళలోని కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరగనుంది. పది ఫ్రాంచైజీలు తమ బలహీనతలను అధిగమించడంపై ఫోకస్ పెట్టాయి. కావాల్సిన ఆటగాళ్ల కోసం అస్త్ర శస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. ఐపీఎల్ కారణంగా ఎంతో మంది యువ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో స్టార్లు ఎదిగారు. 2008లో ప్రారంభమైన ఈ క్యాష్ రిచ్ లీగ్ వరల్డ్ బెస్ట్ టోర్నీగా నిలిచింది. ఈ క్రమంలోనే మాజీ ఆటగాళ్లంతా.. తమ కాలంలో ఐపీఎల్ వంటి టోర్నీలు ఉంటే బాగుండేదని పశ్చాతాపం వ్యక్తం చేస్తుంటారు. అయితే అలనాటి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు ఐపీఎల్ 2023 వేలంలో పాల్గొంటే మాత్రం వారిపై కనక వర్షం కురిసేది.

కపిల్ దేవ్
భారత క్రికెట్ దిగ్గజం, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్.. ఈ తరం క్రికెటర్‌గా ఉండి ఐపీఎల్ 2023 వేలంలో పాల్గొంటే కోట్ల డబ్బులు ఆర్జించేవాడు. పదికి పది ఫ్రాంచైజీలు అతని కోసం పోటీ పడేవి. ఆల్‌రౌండర్లు రాజ్యమేలుతున్న టీ20 ఫార్మాట్‌లో కపిల్ దేవ్ వంటి సత్తా ఉన్నా ఆల్‌రౌండర్ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడేవి. అటు బ్యాట్.. ఇటు బంతితో సత్తా చాటే కపిల్ దేవ్.. తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలడు. 1983 ప్రపంచకప్‌లో తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతోనే భారత్‌కు తొలి ప్రపంచకప్ అందించాడు. దూకుడుగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం కపిల్‌కు ఉండటం అదనపు బలం.

జవగళ్ శ్రీనాథ్
ఐపీఎల్‌లో ఫాస్ట్ బౌలర్లకు ఫుల్ డిమాండ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీమిండియా దిగ్గజ పేసర్ జవగళ్ శ్రీనాథ్.. ఈ తరం క్రికెటర్‌గా ఉండి ఐపీఎల్ 2023 వేలంలో పాల్గొంటే ఫ్రాంచైజీలు అతని కోసం తీవ్రంగా పోటీపడేవి. 1990లో మైసూర్ ఎక్స్‌ప్రెస్‌గా అందరి మన్ననలు అందుకున్న జవగళ్ శ్రీనాథ్.. 2003 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. క్విక్, స్వింగ్ బాల్, లెథల్ యార్కర్ వేయడంలో స్పెషలిస్ట్ అయిన శ్రీనాథ్‌లాంటి బౌలర్ జట్టులో ఉండటం ప్రతీ ఫ్రాంచైజీకి అవసరమే. బౌలింగే కాకుండా చివర్లో బ్యాటింగ్‌తో హిట్టింగ్ చేయగల సామర్థ్యం శ్రీనాథ్‌కు ఉండటం మరో అదనపు బలం.

సందీప్ పాటిల్..
డాషింగ్ బ్యాటర్‌గా పేరున్న సందీప్ పాటిల్ కూడా ఐపీఎల్ 2023 వేలంలో పాల్గొని ఉంటే భారీ ధర పలికేవాడు. 1983 ప్రపంచకప్ విజయంలో సందీప్ పాటిల్ కీలక పాత్ర పోషించాడు. బౌలర్లే రాజ్యమేలిన కాలంలోనూ సందీప్ పాటిల్ 82.17 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేసేవాడు. 1983 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సందీప్ పాటిల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి మెరుపులు మెరిపించాడు. 32 బంతుల్లో 52 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. సందీప్ పాటిల్ లాంటి మిడిలార్డర్ బ్యాటర్ కావాలని ప్రతీ ఫ్రాంచైజీ కోరుకుంటది. అతను గనుక ఈ తరంలో ఉండి టీ20 క్రికెట్ ఆడితే మాత్రం కోట్ల డబ్బులతో పాటు టీ20 స్పెషలిస్ట్ ప్లేయర్‌గా అందరి మన్ననలు అందుకునేవాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications