Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 వేలంతో ఆ బలహీనతలను అధిగమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్!

IPL 2023: 3 issues SRH solved at the mini auction

హైదరాబాద్: ఐపీఎల్ 2023 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్.. వ్యూహాత్మకంగా వ్యవహరించింది. డిసెంబర్ 23న కొచ్చి వేదికగా జరిగిన ఈ మినీ వేలంలో అత్యధిక పర్స్ మనీతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. నలుగురు ఓవర్‌సీస్ ఆటగాళ్లతో పాటు మొత్తం 13మందిని కొనుగోలు చేసింది. దాంతో పేపర్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ బలంగా కనిపిస్తోంది. మయాంక్ అగర్వాల్, హరీ బ్రూక్, హెన్రీచ్ క్లాసెన్‌, ఆదిల్ రషీద్ వంటి టాప్ ఆటగాళ్లతో పాటు దేశవాళీ స్టార్లను తీసుకుంది. అయితే ఈ వేలం ద్వారా సన్‌రైజర్స్ ఓ మూడు బలహీనతలను అధిగమించింది.

బలంగా స్పిన్ విభాగం..

బలంగా స్పిన్ విభాగం..

ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నలుగురు పేసర్లతో‌నే బౌలింగ్ విభాగాన్ని నెట్టుకొచ్చింది. భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్ పవర్ ప్లే, డెత్ ఓవర్ల బాధ్యతలు మోయగా.. ఉమ్రాన్ మాలిక్, కార్తీక్ త్యాగీ, మార్కో జాన్సె, ఫజలక్ ఫరూకీ మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేశారు. అయితే స్పిన్ విభాగం మాత్రం హైదరాబాద్‌కు లోటుగా మారింది. రషీద్ ఖాన్‌ను వదిలేసుకున్న తర్వాత ఆ స్థాయి ప్లేయర్‌ను తీసుకోలేకపోయింది. వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్‌లతో స్పిన్‌ విభాగాన్ని నెట్టుకొచ్చింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2023లో ఆదిల్ రషీద్, మయాంక్ మార్కండే, అకీల్ హోస్సెన్‌లను తీసుకొని ఆ బలహీనతకు చెక్ పెట్టింది. దేశవాళీలో రాణించిన వివ్రాంత్ శర్మను భారీ ధరకు సన్‌రైజర్స్ కొనుగోలు చేయగా.. అతను పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా జట్టుకు ఉపయోగపడనున్నాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ మయాంక్ దగర్ కూడా ఉండటంతో స్పిన్ విభాగం పటిష్టంగా మారింది.

బలంగా మిడిలార్డర్ బ్యాటింగ్..

బలంగా మిడిలార్డర్ బ్యాటింగ్..

గత సీజన్‌లో ఎయిడెన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్, రాహుల్ త్రిపాఠిలు సన్‌రైజర్స్ మిడిలార్డర్ బాధ్యతలు మోసారు. అయితే పూరన్ విఫలమ్వవడం జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. దాంతో అతనిపై వేటు వేసిన సన్‌రైజర్స్ హెన్రీచ్ క్లాసెన్‌తో భర్తీ చేసింది. అంతేకాకుండా సూపర్ ఫామ్‌లో ఉన్న హరీ బ్రూక్‌ను తీసుకొని బ్యాటింగ్‌ను మరింత బలోపేతం చేసింది. మయాంక్ అగర్వాల్ చేరికతో టాపార్డర్ కూడా పటిష్టంగా మారింది. గ్లేన్ ఫిలిప్స్ రూపంలో బ్యాకప్ కూడా బలంగానే ఉంది.

కెప్టెన్సీ ఆప్షన్స్‌కు సత్తా ఉన్నోళ్లు..

కెప్టెన్సీ ఆప్షన్స్‌కు సత్తా ఉన్నోళ్లు..

గత సీజన్‌లో కేన్ విలియమ్సన్ జట్టును నడిపించగా.. సన్‌రైజర్స్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దాంతో అతన్ని వదిలించుకున్న ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్సీ కోసం సత్తా ఉన్న ఆటగాళ్లను తీసుకుంది. పంజాబ్ కింగ్స్ సారథి మయాంక్ అగర్వాల్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్.. తమ తదుపరి కెప్టెన్‌గా అతన్నే నియమించే అవకాశం ఉంది. అతనితో పాటు ఎయిడెన్ మార్క్‌రమ్, భువనేశ్వర్ కుమార్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ పేర్లను కూడా సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ పరిశీలిస్తోంది. అలాగే బ్రూక్, క్లాసెన్‌ వంటి మ్యాచ్ విన్నర్లను కొనుగోలు చేసింది. వీరి చేరికతో సన్‌రైజర్స్ డేంజరస్‌గా మారింది.

Story first published: Friday, January 6, 2023, 18:49 [IST]
Other articles published on Jan 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+