Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: గాయంతో శ్రేయస్ అయ్యర్ దూరం.. కేకేఆర్ కెప్టెన్సీ రేసులో ఆ ముగ్గురు!

 IPL 2023: 3 captaincy options for KKR in the absence of Shreyas Iyer

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు బిగ్ షాక్ తగిలింది. వెన్ను గాయంతో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆటకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ‌లో నాలుగో టెస్ట్ సందర్భంగా అయ్యర్ వెన్ను గాయం తిరగబెట్టింది. దాంతో అతను బ్యాటింగ్ కూడా చేయలేదు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అయ్యర్‌ను ఆసుపత్రికి తరలించి పలు పరీక్షలు జరపించారు. గాయం నయమవడానికి 4-5 వారాల సమయం పడుతుందని వైద్యులు సూచించిన నేపథ్యంలో అతను ఐపీఎల్ 2023 ఫస్టాఫ్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యే చాన్స్ కూడా ఉంది. టోర్నీ ప్రారంభానికి ముందే కెప్టెన్ సేవలను కోల్పోవడం కేకేఆర్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికిప్పుడు అయ్యర్ స్థానంలో కొత్త ఆటగాడిని తీసుకు రావడం కష్టం కానీ.. జట్టులో ఉన్న ఓ ముగ్గురిని కెప్టెన్‌గా నియమించుకోవచ్చు.

షకీబ్ అల్ హసన్

షకీబ్ అల్ హసన్

వరల్డ్ నెంబర్ వన్ ఆల్‌రౌండర్, బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. కేకేఆర్ కెప్టెన్సీ రేసులో ముందున్నాడు. షకీబ్ అల్ హసన్ సారథ్యంలోనే బంగ్లాదేశ్ సొంతగడ్డపై వరల్డ్ చాంపియన్‌ ఇంగ్లండ్‌ను క్లీన్ స్వీప్ చేసింది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండటంతో పాటు ఐపీఎల్ ఆడిన అపార అనుభవం అతని సొంతం. షకీబ్ ఇప్పటి వరకు 71 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 63 వికెట్లతో పాటు 793 పరుగులు చేశాడు. కేకేఆర్ టైటిల్ గెలిచిన 2012, 2014 సీజన్లలో షకీబ్ కీలక పాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో అతనికే సారథ్య బాధ్యతలు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

టీమ్ సౌథీ..

టీమ్ సౌథీ..

షకీబ్ తర్వాత టీమ్ సౌథీ పేరు కూడా కేకేఆర్ కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ టెస్ట్ టీమ్‌ను నడిపిస్తున్న సౌథీ.. టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. వెల్లింగ్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ల్లో సౌథీ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 52 మ్యాచ్‌ల్లో 45 వికెట్లు పడగొట్టాడు.

 నితీశ్ రాణా..

నితీశ్ రాణా..

స్వదేశి ప్లేయర్‌నే కెప్టెన్‌గా నియమించుకోవాలనుకుంటే మాత్రం నితీశ్ రాణా.. కేకేఆర్ సారథ్య బాధ్యతలను అందుకోనున్నాడు. చాలా రోజులుగా కేకేఆర్‌కు ఆడుతున్న నితీశ్ రాణా.. నిలకడగా రాణించకున్నా అతనిపై మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచింది. దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టును నడిపిన అనుభవం నితీశ్ రాణాకు ఉంది. దేశవాళీ, ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉన్న రాణాను.. కేకేఆర్‌ను నడిపించే సత్తా కూడా ఉందని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తోంది. కేకేఆర్ తరఫున 74 మ్యాచ్‌లు ఆడిన రాణా.. 1744 పరుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలున్నాయి. బౌలింగ్‌లో 7 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Wednesday, March 15, 2023, 16:23 [IST]
Other articles published on Mar 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+