Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs KKR:ఆ మూడు తప్పిదాలే సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచాయి!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌కు మరో ఓటమి ఎదురైంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఉప్పల్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 పరుగులతో పరాజయం పాలైంది. చివరి ఓవర్‌లో 9 పరుగులు చేయలేక చేతులెత్తేసింది.

సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను సన్‌రైజర్స్ పేలవ బ్యాటింగ్‌తో చేజార్చుకుంది. ఎప్పటిలానే సన్‌రైజర్స్ లోయారార్డర్ మరోసారి విఫలమైంది. ముఖ్యంగా మూడు తప్పిదాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాయి.

3 Big Reasons Why SRH Lost against KKR

1. స్టార్ ఆటగాళ్ల వైఫల్యం:ఓపెనర్లు అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్‌తో పాటు రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్ దారుణంగా విఫలమవడం సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయవకాశాలను దెబ్బతీసింది. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన అభిషేక్ ఈ మ్యాచ్‌లో 9 పరుగులకే వెనుదిరిగాడు. మరోవైపు మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్ తమ వైఫల్యాన్ని కొనసాగించారు.

ముఖ్యంగా హ్యారీ బ్రూక్ డకౌట్‌గా వెనుదిరిగాడు. రాహుల్ త్రిపాఠా ధాటిగా ఆడి కాస్త పర్వాలేదనిపించినా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఈ నలుగురిలో ఒక్కరు మెరుగైన ఇన్నింగ్స్ ఆడినా పరిస్థితి మరోలా ఉండేది.

2. క్లాసెన్-మార్క్‌రమ్ భాగస్వామ్యం బ్రేక్ అవ్వడం..:54 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాస్ ఆదుకున్నారు. మార్క్‌రమ్ నిదానంగా ఆడినా క్లాసెన్ భారీ సిక్సర్లు బాదాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టు స్కోర్‌ను పరుగెత్తించాడు. ఐదో వికెట్‌కు 70 పరుగులు జోడించిన అనంతరం భారీ షాట్ ఆడే ప్రయత్నంలో హెన్రీచ్ క్లాసెన్ పెవిలియన్ చేరడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆచితూచి ఆడిన మార్క్‌రమ్‌ కూడా వెనుదిరగడంతో సన్‌రైజర్స్ కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఈ ఇద్దరిలో ఒక్కరైనా చివరి వరకు ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

3.వికెట్లు కోల్పోవడం..:క్లాసెన్- మార్క్‌రమ్ ఔటైనా సన్‌రైజర్స్ విజయానికి చివరి 19 బంతుల్లో 27 పరుగులకే కావాలి. ఆచితూచి ఆడినా సన్‌రైజర్స్ విజయం సాధించేది. కానీ ఒత్తిడికి లోనైన సన్‌రైజర్స్ వికెట్లు కోల్పోయి ఓటమికి తల వంచింది. 18వ ఓవర్‌లో వరుణ్ చక్రవర్తీ 5 పరుగులే ఇవ్వడంతో ఒత్తిడికి గురైన మార్కో జాన్సెన్ క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత భువీ, సమద్ బౌండరీలు బాదినా.. ఆఖరి ఓవర్‌లో అబ్దుల్ సమద్ భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరగడంతో మ్యాచ్ కేకేఆర్ వశమైంది. కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా.. వరుణ్ చక్రవర్తీని డెత్ బౌలర్‌గా వాడుకోవడం కలిసొచ్చింది.

Story first published: Friday, May 5, 2023, 10:18 [IST]
Other articles published on May 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+