Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: జింబాబ్వే స్టార్ పేసర్‌కు బంపర్ ఆఫర్.. లక్నో టీమ్‌లో చాన్స్!

IPL 2022: Zimbabwe fast bowler Blessing Muzarabani set to join Lucknow Super Giants

ముంబై: జింబాబ్వే స్టార్ పేసర్ బ్లెస్సింగ్ ముజారబానీ లక్కీ చాన్స్ కొట్టేసాడు. ప్రతిష్టాత్మక ఐపీఎల్ టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని అందుకున్నాడు. అయితే అది టీమ్ బౌలర్‌గానా? లేక నెట్ బౌలర్‌గానా? అనే విషయంపై స్పష్టత లేదు. ఈ సీజన్‌తో లీగ్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్‌కు టోర్నీ ఆరంభానికి ముందే ఎదురుదెబ్బ తగిలింది. మెగా వేలంలో భారీ ఆశలతో ఆ జట్టు కొనుగోలు చేసిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మార్క్ వుడ్ గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలున్నాయి.

ఈ క్రమంలో మార్క్ వుడ్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు లక్నో ఫ్రాంచైజీ కసరత్తు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో వుడ్ స్ధానాన్ని జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజారబానీతో భర్తీ చేయాలని లక్నో ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే దాదాపు అతను ఐపీఎల్‌లో పాల్గోవడం ఖాయంగా కనిపిస్తోంది. క్యాష్ రిచ్ లీగ్ కోసం ముజారబానీ భారత్‌కు బయలుదేరినట్లు జింబాబ్వేలోని భారత రాయబారి కార్యాలయం ద్రువీకరించింది. అయితే ముజారబానీని వుడ్‌ స్ధానంలో భర్తీ చేస్తారా లేదా నెట్ బౌలర్‌గా ఎంపిక చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. కాగా అంతకుముందు వుడ్‌ స్ధానాన్ని బంగ్లాదేశ్‌ పేసర్‌ టాస్కిన్‌ ఆహ్మద్‌తో భర్తీ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే అతను సౌతాప్రికా పర్యటనలో బంగ్లాదేశ్‌ జట్టుతో ఉండటంతో అతనికి ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతిని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు నిరాకరించింది. దీంతో అతని స్థానంలో ముజారబానీని జట్టులో తీసుకోవాలని లక్నో భావిస్తున్నట్లు సమాచారం. ఇక మార్చి 26 నుంచి క్యాష్ రిచ్ లీగ్‌ ప్రారంభం కానుండగా.. మార్చి 28 మరో కొత్త జట్టు గుజరాత్‌ టైటాన్స్‌తో లక్నో తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది.

మెగా ఆక్షన్‌‌లో అన్ని ఫ్రాంచైజీల కంటే దూకుడుగా వ్యవహరించి.. పక్కా ప్రణాళికలతో సరికొత్త ప్లేయర్లను తీసుకున్న సూపర్‌‌ జెయింట్స్‌‌ అరంగేట్రంలోనే ట్రోఫీతో అద్భుతం చేయాలని భావిస్తోంది. మెగా లీగ్‌‌పై తనదైన ముద్ర వేసిన కేఎల్‌‌ రాహుల్‌‌ను కెప్టెన్‌గా ఎంచుకుని తొలి అడుగు ఘనంగా వేసింది! ఇక పేపర్‌‌ మీద టీమ్‌‌ కాంబినేషన్‌ అంతా బాగానే కనిపిస్తున్నా.. అసలు సమరంలో ఎంతవరకు సత్తా చూపిస్తుందో చూడాలి..! ఓవరాల్‌‌గా వేలాది కోట్లను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేసి మెగా లీగ్‌‌లోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో ఫ్రాంచైజీ టైటిల్ లక్ష్యంగా సిద్దమవుతోంది.

Story first published: Tuesday, March 22, 2022, 12:26 [IST]
Other articles published on Mar 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+