SRH vs RR: మాకు మ్యాచ్ చూసే ఇంట్రెస్ట్ పోయింది! తగలబెట్టండి నిరంజన్ గారూ.. సన్‌రైజర్స్‌పై పేలుతున్న సెటైర్స్

పుణే: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సొంత జట్టు అభిమానులే ట్రోలింగ్‌కు దిగుతున్నారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ఒకరికొకరు పోటాపడి మరీ పరుగులిస్తున్నారు. నోబాల్స్, వైడ్స్‌తో అభిమానులకు చికాకు తెప్పిస్తున్నారు. దాంతో సన్‌రైజర్స్ టీమ్ మేనేజ్‌మెంట్‌పై మరోసారి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన జట్టును తీసుకోకుంటే ఇలానే బాధపడాల్సి వస్తుందని చురకలంటిస్తున్నారు.
సుంధర్‌ను తిడుతూ..
ముఖ్యంగా భారీ ధర వెచ్చించిన వాషింగ్టన్ సుంధర్, రిటైన్ చేసుకున్న ఉమ్రాన్ మాలిక్‌లను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఉమ్రాన్ మాలిక్ రెండు కీలక వికెట్లు తీసినప్పటికీ... ధారళంగా పరుగులిచ్చాడు. 4 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక సుంధర్ రెండు ఓవర్లలోనే 32 పరుగులు సమర్పించుకున్నాడు. స్పిన్నర్ అయ్యుండి కూడా నో బాల్ వేసాడు. దాంతో తీవ్ర చికాకు గురైన నెటిజన్లు సుందర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. వాషింగ్టన్ సుందర్‌ను ఎందుకు కొన్నారు రా అయ్యా? వాడికి రూ.8.75 కోట్లు బొక్క అంటూ ఘాటుగా కామెంట్ చేస్తున్నారు.
మ్యాచ్ చూసే ఇంట్రెస్ట్ పోయింది..
ఈ సుందర్ గాడి కంటే ఆ త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్ గాడే నయమని కామెంట్ చేస్తున్నారు. శంకర్ కనీసం బౌలింగ్ అన్నా సరిగ్గా చేసేవాడని, సుందర్ అది కూడా చేయడం లేదని విమర్శిస్తున్నారు. స్టార్ ప్లేయర్లను కాదని రిటైన్ చేసుకున్న ఉమ్రాన్ మాలిక్‌ను కూడా తిట్టని తిట్లు తిడుతున్నారు. అత్యంత వేగవంతమైన బంతులు వేస్తున్నాడని, కానీ లైన్ అండ్ లెంగ్త్ మిస్సవుతున్నాడని విమర్శిస్తున్నారు. రాజస్థాన్ బౌలర్లు కుక్కని కొట్టినట్లే కొడుతున్నారని, ఈ తరహా గేమ్ చూసిన తర్వాత మ్యాచ్ చూడాలనే ఉత్సాహం కూడా పోయిందంటున్నారు.
దంచికొట్టిన సంజూ..
సన్‌రైజర్స్ చెత్త బౌలింగ్‌తో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు దంచికొడుతున్నారు. కెప్టెన్ సంజూ శాంసన్ హాఫ్(27 బంతుల్లో 55) సెంచరీ సాధించగా.. దేవదత్ పడిక్కల్(41), జోస్ బట్లర్(35)కూడా దంచి కొట్టారు. దాంతో సన్‌రైజర్స్.. భారీ టార్గెట్ దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటికే 170 పరుగులు పూర్తి చేసుకుంది. ఇక బ్యాటింగ్ లైనప్ లేని హైదరాబాద్.. ఈ లక్ష్యాన్ని చేధించడం కష్టమేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు వరుసగా టాస్ గెలిచిన జట్లే విజయాన్నందుకున్నాయని, కానీ సన్‌రైజర్స్ ఆ ట్రెండ్ మారుస్తదని కామెంట్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications