IPL 2022 Winner: ఐపీఎల్ 2016 రిపీట్.. మళ్లీ టాప్‌లో గుజరాత్..! సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే టైటిల్!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. లీగ్‌లో సగానికి పైగా (41) మ్యాచ్‌లు ముగిసాయి. లీగ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లుగా నిలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శనతో టైటిల్ రేసు నుంచి తప్పుకున్నాయి. వరుస ఓటములతో ముంబై.. అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా.. చెన్నై 99.9 శాతం అవకాశాలు కోల్పోయింది.
8 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో గుజరాత్ టైటాన్స్ టాప్‌లో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ టాప్-4లో కొనసాగుతున్నాయి. 5 విజయాలతో ఆర్‌సీబీ ఐదో స్థానంలో ఉండగా.. నాలుగేసి విజయాలతో ఢిల్లీ, పంజాబ్ 6, 7 స్థానాల్లో ఉన్నాయి. కేకేఆర్ సైతం 6 ఓటములతో తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ఐపీఎల్ 2016 రిపీట్..
ఇప్పటి వరకు జరిగిన లీగ్ తీరును చూస్తుంటే ఐపీఎల్ 2016 సీజన్ మళ్లీ రిపీట్ అయినట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా ఓ ఏడు కారణాలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఐపీఎల్ 2016 సీజన్‌లో కూడా కొత్తగా రెండు జట్లు రాగా.. లీగ్ ప్రారంభానికి ముందే టైటిల్ స్పాన్సర్‌గా వివో వచ్చింది. కొత్తగా పుణే సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్ వచ్చాయి.
పాయింట్స్ టేబుల్‌లో గుజరాత్ లయన్స్ టాప్‌లో నిలవగా.. స్పాట్ ఫిక్స్ ఆరోపణలతో చెన్నై, రాజస్థాన్ రాయల్స్ నిషేధానికి గురయ్యాయి. ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. రాయల్ పేరు కలిగిన జట్లలోని ఆటగాడు(కోహ్లీ) సెంచరీలు, అత్యధిక సిక్సర్లతో ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్, యుజ్వేంద్ర చాహల్‌లు ఇద్దరూ పీక్ ఫామ్ కనబర్చారు.

ఈ సీజన్‌లో కూడా...
ఐపీఎల్ 2022 సీజన్‌లో కూడా కొత్తగా రెండు జట్లు వచ్చాయి. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్‌గా బరిలోకి దిగాయి. మళ్లీ గుజరాత్ జట్టే పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో కొనసాగుతోంది. చెన్నై, ముంబై పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.
మళ్లీ రాయల్ టీమ్ ఆటగాడు(జోస్ బట్లర్) వరుస సెంచరీలు, అత్యధిక సిక్సర్లతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. మళ్లీ ముస్తాఫిజుర్ రెహ్మాన్, యుజ్వేంద్ర చాహల్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఈ కారణాలతోనే ఐపీఎల్ 2022లో ఐపీఎల్ 2016 సీజన్ రిపీట్ అవుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే టైటిల్..
2016 సీజన్‌లో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. అప్పుడు కూడా సమష్టిగా రాణిస్తూ.. బౌలింగ్ బలంతోనే ఈ ఘనతను అందుకుంది. తాజా సీజన్‌లో కూడా సన్‌రైజర్స్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. మరోవైపు 2016 సీజన్ ఫైనల్లో హైదరాబాద్‌తో తలపడిన ఆర్‌సీబీ సైతం ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది.
వరుస విజయాలు సాధించిన ఆ జట్టు గత రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ టీమ్ బలంగానే ఉంది. ఈ లెక్కన మళ్లీ ఫైనల్లో ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడే అవకాశం ఉందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అప్పటిలానే సన్‌రైజర్స్ టైటిల్ కైవసం చేసుకుంటుందని జోస్యం చెబుతున్నారు. ఆర్‌సీబీ కాకుంటే రాయల్స్ పేరు కలిగిన రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ ఫైనల్ ఆడుతుందని అంచనా వేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications