For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: ఈ సారైనా మా కావ్య పాపను నవ్వించండయ్యా! ఖతర్నాక్ ఆటగాళ్లను తీసుకోండయ్యా!

IPL 2022: Will Sunrisers Hyderabad Make Kavya Maran Happy By Buying Good Players

హైదరాబాద్: క్రికెట్‌ అభిమానుల పండగ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో అసలు ఆటకు ముందు 'నోట్లాట'కు రంగం సిద్ధమైంది. నాలుగేళ్ల విరామం తర్వాత పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు అందుబాటులోకి వస్తూ మెగా వేలం జరగనుంది. అబ్బో అనిపించే ఆశ్చర్యాలు, అయ్యో అనిపించే నిరాశలు, ఆహా అనిపించే ఎంపికలు, అంతేనా అనిపించే సర్దుబాట్లు... ఎప్ప టిలాగే ఇలా అన్ని భావోద్వేగాలు అభిమానుల్లో కనిపించవచ్చు. మరికొద్ది క్షణాల్లో బెంగళూరు వేదికగా ఈ మహా ఘట్టానికి తెరలేవనుంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ వేలంలో

తొలి రోజు 161 మంది..

తొలి రోజు 161 మంది..

శనివారం 161 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మిగిలిన ఆటగాళ్ల కోసం ఆదివారం 'యాక్సెలరేటెట్‌ ప్రాసెస్‌' ద్వారా ఆటగాళ్లను ఎలిమినేట్ చేస్తారు. అంటే 161 మంది ఆటగాళ్లు పోగా, మిగిలిన 439 మందిని ఆదివారం వేలం వేయరు. తొలి రోజు ముగిసిన తర్వాత పది ఫ్రాంచైజీలు ఇంకా ఎవరెవరు వేలంలో ఉంటే బాగుంటుందని తమ సూచనలు ఇస్తాయి. ఆ ఆటగాళ్లు పేర్లు మాత్రమే రెండో రోజు వేలంలో వినపడతాయి. మిగిలిన వారిని తొలగిస్తారు.

కావ్య మారన్ కోసం..

కావ్య మారన్ కోసం..

ఇక గత సీజన్‌లో పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సారైనా మంచి టీమ్ తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. ముఖ్యంగా ఆ టీమ్ ఓనర్ కావ్య మారన్ కోసమైనా గెలిచే టీమ్ తీసుకోవాలంటున్నారు. ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కన్నా ఆ టీమ్ ఓనర్ కావ్య మారనే ప్రేక్షకులను అలరించిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సీజన్‌లో వరుస ఓటములతో పాయింట్స్ టేబుల్లో ఆరెంజ్ ఆర్మీ అట్టడుగున నిలిచింది. అయితే ప్రతీ మ్యాచ్‌కు హాజరైన ఆ టీమ్ ఓనర్ కావ్య మారన్ తన హవాభావాలతో ప్రేక్షకులను అలరించింది.

హీరోయిన్‌లా ఉండటంతో..

ఎంతలా అంటే మైదానంలో బ్యాట్స్‌మెన్ ఫోర్ కొట్టినా.. బౌలర్ వికెట్ తీసినా టీవీ కెమెరాలు ఆమెనే పదేపదే చూపించేంత. జట్టు మంచి స్థితిలో ఉన్నప్పుడు ఆమె కొట్టే కేరింతలు.. ఓడినప్పుడు బుంగ మూతి పెడుతూ ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆమె హవాభావాలన్నీ మీమ్స్‌గా నెట్టింట వైరల్ అయ్యాయి. బాలీవుడ్ హీరోయిన్‌ను తలపించే కావ్య మారన్ అందానికి అభిమానులు ఫిదా అయ్యారు. తమ అభిమాన జట్టుతో పాటు కావ్యను ఇష్టపడుతున్నారు.

 టామ్‌ మూడీపైనే..

టామ్‌ మూడీపైనే..

ఈ క్రమంలోనే గత సీజన్ మాదిరి ఆమె మళ్లీ బాధపడటం తమకు ఇష్టంలేదని, వేలంలో పకడ్బందీ ప్రణాళికలతో బరిలోకి దిగాలని సూచిస్తున్నారు. కాఫీ, టీలు తాగుతూ.. బిస్కెట్లు తింటూ టైమ్ వృథా చేయవద్దని, దూకుడుగా ఉంటూ ఖతర్నాక్ ఆటగాళ్లను తీసుకోవాలని కోరుతున్నారు. ఇక సన్‌రైజర్స్ ఈ సీజన్ కోసం సపోర్ట్ స్టాఫ్‌ను మొత్తం మార్చేసింది. టీమ్ డైరెక్టర్‌గా టామ్ మూడీ, అసిస్టెంట్ కోచ్‌గా సీమన్ కటీచ్, బ్యాటింగ్ కోచ్‌గా బ్రియాన్ లారా, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా మురళీ ధరన్, ఫీల్డింగ్ కోచ్‌గా హేమాంగ్ బదానీని నియమించారు. డైరెక్టర్ టామ్ మూడీపైనే అభిమానులు నమ్మకం ఉంచారు.

Story first published: Saturday, February 12, 2022, 11:56 [IST]
Other articles published on Feb 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+