Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH 2022: రషీద్ ఖాన్‌ను కాదని భువీ, నట్టూ, జాన్సన్, ఉమ్రాన్‌లను కావ్య పాప ఎందుకు తీసుకుందంటే..?

IPL 2022: Why Kavya Maran Choose Bhuvneshwar, Natarajan, Umran, Jansen Over Rashid Khan For SRH

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆరంభంలో రెండు మ్యాచ్‌లు ఓడి అభిమానులను తీవ్రంగా నిరాశ పర్చిన ఆరెంజ్ ఆర్మీ.. ఆ తర్వాత నేలకు కొట్టిన బంతిలా పుంజుకొని వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

అయితే వేలంలో సరైన ఆటగాళ్లను కొనుగోలు చేయలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆరంభంలోనే రెండు ఘోర పరాజయాలతో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. మరోసారి హైదరాబాద్‌ పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానంలో నిలుస్తుందని అంతా అనుకున్నారు.

తిట్టిన వారే సెల్యూట్ చేస్తున్నారు..

అనూహ్యంగా డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత అదే జోరులో పటిష్ట గుజరాత్‌ను ఓడించింది. ఈ రెండు విజయాలు గాలివాటమేనని కొందరూ తీసిపారేసారు. కానీ అత్యంత పటిష్టమైన కోల్‌కతాతో పాటు పంజాబ్‌ను మట్టికరిపించడంతో ఇక హైదరాబాద్‌కు తిరుగులేదని ప్రశంసిస్తున్నారు.

ముఖ్యంగా ఆ జట్టు ఓనర్ కావ్యమారన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వేలం సమయంలో ఆమెపై దారుణ ట్రోలింగ్‌కు దిగిన నెటిజన్లే ఇప్పుడు ఆమె మాస్టర్ మైండ్‌కు సలాం చేస్తున్నారు.

రషీద్ ఖాన్‌కు అనవసరమని..

రషీద్ ఖాన్‌కు అనవసరమని..

ఎన్నో ఏళ్ల నుంచి జట్టుతో ఉన్న స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను రిటైన్ చేసుకోకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే రషీద్ ఖాన్‌ను కావ్య పాప మాస్టర్ మైండ్‌తోనే వదిలేసింది. రూ.16 కోట్లు ఇస్తేగానీ రషీద్ ఖాన్‌ రిటెన్షన్‌కు ఒప్పుకోలేదు. దాంతో అతన్ని వదిలేసిన కావ్య.. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో పాటు యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌, అబ్దుల్ సమద్‌ను రిటైన్ చేసుకుంది. ఉమ్రాన్ మాలిక్‌ను రూ.4 కోట్లకే అంటిపెట్టుకుంది. ఈసారి బ్యాటింగ్‌ను బలోపేతం చేయాలని భావించిన కావ్య పాప.. బౌలర్లను అగ్గువకే కొనుగోలు చేసింది.

రూ.16 కోట్లకే కత్తిలాంటి పేసర్లు..

రూ.16 కోట్లకే కత్తిలాంటి పేసర్లు..

రషీద్ ఖాన్‌కు ఇచ్చే రూ.16 కోట్లకే నలుగురు కత్తిలాంటి పేసర్లను తీసుకొంది. ఉమ్రాన్ మాలిక్‌తో పాటు భువనేశ్వర్ కుమార్, నటరాజన్, మార్కో జాన్సెన్‌లకు రూ.4 కోట్ల చొప్పునే ఖర్చు బెట్టింది. ఈ డబ్బులను పవర్ హిట్టర్స్ నికోలస్ పూరన్, దేశవాళీ స్టార్ అభిషేక్ శర్మ, ఆల్‌రౌండర్ రొమారియో షెఫెర్డ్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, వాషింగ్టన్ సుంధర్‌ల కోసం ఖర్చు చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనా ఆ తర్వాత ఈ నలుగురు పేసర్లు చెలరేగడంతో సన్‌రైజర్స్ విజయాల బాట పట్టింది.

రషీద్ ఖాన్= భువీ+నట్టూ+ఉమ్రాన్+జాన్సెన్

రషీద్ ఖాన్= భువీ+నట్టూ+ఉమ్రాన్+జాన్సెన్

ఈ క్రమంలోనే కావ్య పాపది మాస్టర్ మైండ్ అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. రషీద్ ఖాన్= భువీ+నట్టూ+ఉమ్రాన్+జాన్సెన్ అని ట్వీట్ చేస్తున్నారు. రషీద్ ఖాన్ ఒక్కడికి అంత ఖర్చు చేస్తే.. ఇలాంటి జట్టు మళ్లీ వచ్చేది కాదంటున్నారు. కావ్య మారనా.. కళానిధి బిడ్డనా? అంటూ మెచ్చుకుంటున్నారు. జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోయినా.. పేసర్లు అదరగొడుతున్నారని కొనియాడుతున్నారు. ఉమ్రాన్ మాలిక్ జట్టుకు గొప్ప ఆస్థి అంటూ ప్రశంసిస్తున్నారు.

Story first published: Monday, April 18, 2022, 17:36 [IST]
Other articles published on Apr 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+