IPL 2022: టోర్నీ మొత్తం 1062 సిక్స్‌లు.. ఏ జట్టు ఎక్కువ సిక్స్‌లు ఇచ్చిందంటే..?

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అంటేనే ధనాధన్ సిక్సర్ల పండుగ. పూర్తిగా బ్యాటింగ్‌కు ఫేవర్‌గా ఉండే టోర్నీ. అభిమానులకు కావాల్సిన అసలు సిసలు మజాను అందించే వరల్డ్ బెస్ట్ లీగ్. గత మూడు నెలలుగా యావత్ క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మత్తులో మునిగి తేలారు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో రికార్డులు నమోదవ్వడం.. బద్దలవ్వడం సర్వసాధారణం. ప్రతీ సీజన్‌లో ఏదో ఒక కొత్త రికార్డు నమోదవుతూనే ఉంటుంది. ఈ సారి కూడా ఓ నయా రికార్డు క్రియేట్ అయ్యింది. అదేంటంటే.. ఈ సీజన్‌లో ఏకంగా 1062 సిక్స్‌లు నమోదయ్యాయి. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో రోమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో లివింగ్ స్టోన్ కొట్టిన సిక్స్‌తో 1000 మార్క్ నమోదైంది.

ఆర్‌సీబీ చెత్త రికార్డు..
ఈ 1062 సిక్స్‌ల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టే 147 సిక్సర్లు సమర్పించుకుంది. 16 మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ బౌలర్లు 147 సిక్స్‌లు ఇచ్చారు. దీంతో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న జట్టుగా ఆర్‌సీబీ తమ పేరిట చెత్త రికార్డు లిఖించుకుంది. ఆర్‌సీబీ తర్వాత రాజస్థాన్ రాయల్స్ 113 సిక్స్‌లు ఇచ్చుకొని రెండో స్థానంలో నిలిచింది. ఆ జట్టు బౌలర్లు 17 మ్యాచ్‌ల్లో 2832 బంతుల్లో 113 సార్లు సిక్స్‌లు ఇచ్చారు. ఒక్క సిక్స్ తేడాతో రాజస్థాన్ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. 112 సిక్స్‌లతో ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఆ జట్టు బౌలర్లు 14 మ్యాచ్‌ల్లో 2416 బంతులు వేసారు.

చెన్నై ఇచ్చింది 86 సిక్స్‌లు..
ఫైవ్ టైమ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్‌ల్లో 104 సిక్స్‌లు ఇవ్వగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 14 మ్యాచ్‌ల్లో 103 సిక్స్‌లు ఇచ్చారు. టైటిల్ విజేత గుజరాత్ టైటాన్స్ 16 మ్యాచ్‌ల్లో 101 సిక్స్‌లు సమర్పించుకుంది. ఆ జట్టు బౌలర్లు మొత్తంగా 2534 పరుగులు ఇచ్చారు. లక్నో సూపర్ జెయింట్స్ 15 మ్యాచ్‌ల్లో 94, పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్‌ల్లో 91 సిక్స్‌లు ఇచ్చుకుంది. అతి తక్కువగా డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 86 సిక్స్‌లు ఇచ్చింది.

టీమ్స్ ప్రకారం..
ఆర్‌సీబీ 147
రాజస్థాన్ 113
సన్‌రైజర్స్ 112
ముంబై 111
కేకేఆర్ 104
ఢిల్లీ 103
గుజరాత్ 101
లక్నో 94
పంజాబ్ 91
సీఎస్‌కే 86
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications