Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: కింగ్ ఈజ్ బ్యాక్.. హాఫ్ సెంచరీతో అరుదైన ఘనత!

IPL 2022: Virat Kohli Is Back To His Form With A Half Century

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో తన పేలవ ప్రదర్శనకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ముగింపు పలికాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. క్రీజులో కుదురుకోవడానికి టైమ్ తీసుకున్నా.. చూడ చక్కని షాట్లతో అలరించాడు. యువ ప్లేయర్ రజత్ పటీదార్ సాయంతో ఆచితూచి ఆడిన కోహ్లీ.. మహమ్మద్ షమీ వేసిన 13వ ఓవర్‌లో క్విక్ సింగిల్ తీసి 45 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

15 ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల తర్వాత విరాట్ కోహ్లీకి ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఈ ఇన్నింగ్స్ ద్వారా విరాట్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఓ ఫ్రాంచైజీ ద్వారా అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన ప్లేయర్‌గా కోహ్లీ నిలిచాడు. ఇక విరాట్ కోహ్లీకి అండగా.. యువ ప్లేయర్ రజత్ పటీదార్ కూడా రాణించడంతో ఆర్‌సీబీ మెరుగైన పరస్థితుల్లో బ్యాటింగ్ చేస్తోంది. 29 బంతుల్లో రజత్ పటీదార్ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఇక విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పట్ల అతని సతమణీ అనుష్క శర్మతో సహచర ఆర్‌సీబీ ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యర్థి జట్టు ప్రధాన పేసర్ మహమ్మద్ షమీ సైతం కోహ్లీని అభినందిస్తూ అతనిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక కోహ్లీ అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. ప్రశాంతంగా ఉంటూ కోహ్లీపై నమ్మకం ఉంచండని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Saturday, April 30, 2022, 17:12 [IST]
Other articles published on Apr 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+