For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: సన్‌రైజర్స్ ఆటగాళ్లకు పుష్ప స్టైల్ ‘తగ్గేదేలే’పోటీ‌లు! (వీడియో)

IPL 2022: Video Of SRH Players Imitating Thaggedhe Le From Pushpa

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ అన్ని విధాలుగా సన్నదమవుతోంది. మైదానంలో చెమటోడ్చుతూనే తమపై ఆగ్రహంగా ఉన్న అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా తమ క్యాంపైన్ షురూ చేసింది. తెలుగు అభిమానులను మచ్చిక చేసుకునేందుకు భాష‌తో పాటు సినిమాలను అస్త్రంగా వాడుకుంటోంది. ఇప్పటికే ట్వీట్సన్నీ తెలుగులోనే చేస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. టాలీవుడ్ అప్ కమింగ్ మూవీల క్యాంపైయిన్‌లో కూడా పాలు పంచుకుంటూ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది.

ఇప్పటికే టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని సుందరం మూవీ అప్ డేట్ చెప్పిన సన్‌రైజర్స్.. మహేశ్ బాబు అప్‌కమింగ్ మూవీ సర్కారు వారి పాటలోని కళావతి సాంగ్‌కు యువ ప్లేయర్ అభిషేక్ శర్మతో చిందేయించి ఆ మూవీ ప్రమోషన్స్‌లో పాలు పంచుకుంది. దాంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ మద్దతును కూడగట్టుకుంది.

ఇక తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆల్‌టైమ్ రికార్డు మూవీ, పాన్ ఇండియా చిత్రం, ట్రెండ్ సెట్టర్ 'పుష్ప'లోని పాపులర్ డైలాగ్ 'తగ్గేదేలే'‌ను తమ ఆటగాళ్లతో ఇమిటేట్ చేయించింది. వారి మధ్య ఈ డైలాగ్ పోటీ పెట్టింది. ఎవరు ఈ స్టైల్‌ను బాగా అనుకరించారు? అని అభిమానులను ప్రశ్నించింది. భువనేశ్వర్ కుమార్, నటరాజన్, రాహుల్‌ త్రిపాఠిలతో పాటు మరోకరు ఈ పోటీలో పాల్గొన్నారు.

అయితే అభిమానులు మాత్రం కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో చేయించాలని సూచిస్తున్నారు. పుష్ప హిట్ అయిపోయిందని, ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్స్ చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

బ్యాటింగ్ కోచ్ గా వెస్టిండీస్​ లెజెండ్ బ్రియాన్ లారా, పేస్ బౌలింగ్ కోచ్ గా సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్​ స్టెయిన్ ను తీసుకుని అంచనాలు పెంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... మెగా వేలంలో మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ ఏడాదైనా బలమైన కొత్త ప్లేయర్లతో బరిలో నిలుస్తారనుకున్న ఫ్యాన్స్​ ఆశల్ని అడియాశలు చేసింది. ఎప్పట్లానే కేవలం బౌలర్లపైనే ఫోకస్ చేసిన ఆరెంజ్​ ఆర్మీ మరోసారి బలహీన బ్యాటింగ్ లైనప్​తో పోటీపడనుంది.

కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయం ఫ్యాన్స్‌‌ను మరింత కలవరపెడుతోంది. కేన్​ ఇప్పటికే ముంబై చేరుకున్నా.. తను అన్ని మ్యాచ్‌‌లకు అందుబాటులో ఉండేది అనుమానమే. అతనితో పాటు భువీ, నటరాజన్‌లు సైతం గాయాలతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో సన్‌రైజర్స్ టైటిల్ గెలవడం దేవుడెరుగు.. ప్లే ఆఫ్స్ చేరినా అద్భుతమే.

Story first published: Monday, March 21, 2022, 11:48 [IST]
Other articles published on Mar 21, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+