Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: అగ్గువకే అండర్ 19 కెప్టెన్.. లక్కీ చాన్స్ కొట్టేసిన ఢిల్లీ!

IPL 2022: U-19s Yash Dhull picked by Delhi Capitals

బెంగళూరు: అండర్ 19 ప్రపంచకప్‌లో టీమిండియాను విశ్వవిజేతగా నిలబెట్టిన యశ్ ధుల్‌ను అగ్గువ ధరకే ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. రెండో రోజు మెగా వేలంలో ఈ అండర్ 19 కెప్టెన్‌ను తీసుకునేందుకు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడ్డాయి. రూ.20 లక్షల కనీస ధరతో వేలానికి వచ్చిన యశ్ ధుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. దాంతో అతను అప్‌కమింగ్ సీజన్‌లో అరంగేట్రం చేయనున్నాడు.

టీమిండియా అండ‌ర్‌-19 కెప్టెన్ యష్ ధుల్ ఐపీఎల్‌లో అరంగ‌ట్రేం చేయ‌నున్నాడు. ఐపీఎల్‌-2022 మెగా వేలంలో యష్ ధుల్‌ను రూ. 50 ల‌క్ష‌ల‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అత‌డి కోసం పంజాబ్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కి ఢిల్లీ యష్ ధుల్‌ను కైవ‌సం చేసుకుంది. ఇక అండ‌ర్‌-19 ప్ర‌పంచ క‌ప్‌ను య‌ష్ ధుల్ అందించిన సంగ‌తి తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో యష్ బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన సెమీఫైనల్‌లో మ్యాచ్ విన్నింగ్ సెంచరీ న‌మోదు చేశాడు.

అదే విధంగా య‌ష్‌ ఢిల్లీ తరపున రంజీ ట్రోఫీలో కూడా అరంగేట్రం చేయబోతున్నాడు. ఇక రెండో రోజు వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు భారీ ధ‌ర ద‌క్కింది. వేలంలో లివింగ్‌స్టోన్‌ని రూ11.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. డేవిడ్ మ‌ల‌న్‌,మార్నస్‌ లబుషేన్‌, ఇయాన్‌ మోర్గాన్‌,సౌరభ్‌ తివారి,ఆరోన్‌ ఫించ్ వంటి స్టార్ ఆట‌గాళ్లు రెండో రోజు వేలంలో అమ్ముడు పోలేదు.

ఇటీవ‌ల భారత అండ‌ర్ 19 జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌డంలో య‌ష్ ధూల్ కెప్టెన్‌గా, ఆట‌గాడిగా కీల‌క పాత్ర పోషించాడు. అంత‌కుముందు ముండు జరిగిన ఆసియా క‌ప్ గెల‌వ‌డంలోనూ య‌ష్ ధూల్ కెప్టెన్‌గా, బ్యాట‌ర్‌గా కీల‌క పాత్ర పోషించాడు. బ్యాట‌ర్‌గా ప్ర‌స్తుతం య‌ష్ ధూల్ సూప‌ర్ ఫాంలో ఉన్నాడు. ఆసియా క‌ప్‌లో, ప్ర‌పంచ‌క‌ప్‌లో భారీగా ప‌రుగులు సాధించాడు. ప్ర‌పంచ‌క‌ప్‌లో క‌రోనా బారిన ప‌డిన‌ప్ప‌టికీ కోలుకుని వ‌చ్చి స‌త్తా చాటాడు. సెమీ ఫైన‌ల్‌లో టీం క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు బ్యాటింగ్‌కు వ‌చ్చి ఆస్ట్రేలియాపై సూప‌ర్ సెంచ‌రీతో జ‌ట్టును ఆదుకున్నాడు. దీంతో య‌ష్ ధూల్ బ్యాటింగ్‌పై అంద‌రికీ మంచి న‌మ్మ‌కం ఏర్ప‌డింది.

Story first published: Sunday, February 13, 2022, 18:12 [IST]
Other articles published on Feb 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+