IPL 2022: రూల్స్ మార్చిన బీసీసీఐ.. ఇక నుంచి ఇన్నింగ్స్‌కు రెండు రివ్యూలు!

ముంబై: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్ ముగియడంతో ఇప్పుడంతా ఐపీఎల్ 2022 సీజన్ సంబంధించిన చర్చే జరుగుతుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య ఈ నెల 26న జరిగే తొలి మ్యాచ్‌తో ఈ ధనాధన్ లీగ్ మొదలవ్వనుంది. మండు వేసవిలో పసందైన వినోదం అందించేందుకు ఆటగాళ్లంతా సిద్దమయ్యారు. అయితే, ఈసారి ఐపీఎల్ నిబంధనల్లో పలు కీలక మార్పులు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు రంగం సిద్ధం చేసినట్లు కూడా సమాచారం. అప్‌కమింగ్ ఐపీఎల్ సీజన్‌లో కొత్త నిబంధనల వివవరాలను ఓ బీసీసీఐ అధికారి తమకు తెలియజేశాడని క్రిక్‌బజ్‌కు తెలిపింది. ఆ నిబంధనలు ఏంటంటే..?

ప్రతీ ఇన్నింగ్స్‌లో రెండు రివ్యూలు..
ఇక కొత్త నిబంధనల్లో ప్రతీ ఇన్నింగ్స్‌కు రెండు రివ్యూలు కోరే అవకాశం కల్పించారు. ఇంతకుముందు ప్రతీ ఇన్నింగ్స్‌లో ఒక్కో జట్టుకు ఒక్కో రివ్యూ కోరే వెసులుబాటు మాత్రమే ఉండేది. దాన్ని ఇప్పుడు రెండుకు పెంచారు. దీందో ఒక్కో జట్టు ఒక్కో ఇన్నింగ్స్‌లో రెండేసి రివ్యూలు ఉపయోగించుకోవచ్చు.

టెక్నికల్ టీమ్ అంతిమ నిర్ణయం..
ఏదైనా జట్టు మ్యాచ్‌కు ముందు కరోనా బారిన పడితే.. ఆ రోజు మ్యాచ్‌లో దిగేందుకు 11 మంది సరైన ఆటగాళ్లు లేకపోతే ఏం చేయాలనేదానిపైనే కచ్చితమైన ప్రణాళిక రూపొందించారని తెలిసింది. కాగా, ఇదివరకు అలాంటి పరిస్థితుల్లో ఆరోజు జరగాల్సిన మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసేవారు. ఇప్పుడు కూడా అలా రీషెడ్యూల్ చేసేందుకు చూస్తారు. ఒకవేళ అది కూడా సాధ్యంకాని పరిస్థితుల్లో ఆ విషయాన్ని ఐపీఎల్ టెక్నికల్ టీమ్ దృష్టికి తీసుకెళ్తారు. వాళ్లు తీసుకునే నిర్ణయమే అంతిమం.

క్యాచ్ ఔటైతే..
ఇటీవల మెరిల్ బోర్న్ క్రికెట్ క్లబ్ తీసుకొచ్చిన కొత్త నిబంధన.. ఎవరైనా బ్యాట్స్‌మన్ క్యాచ్ ఔటైన సందర్భాల్లో.. క్రీజులోకి వచ్చే ఆటగాడే స్ట్రైకింగ్ చేయాలనే కొత్త నిర్ణయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. దాన్ని ఈ సీజన్‌లోనే అమలు చేయాలనుకుంటున్నారు.

ఫలితం తేలకపోతే..
ఇక ప్లే ఆఫ్స్ లేదా ఫైనల్ లాంటి కీలక మ్యాచ్‌ల్లో ఏదైనా ఫలితం తేలకుండా టైగా మారితే.. నిర్ణీత సమయంలో సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. అది కూడా కుదరని పక్షంలో లీగ్ స్టేజ్‌లో పాయింట్ల పట్టికలో మెరుగ్గా ఉన్న జట్టునే విజేతగా ప్రకటిస్తారని ఆ అధికారి చెప్పారు. అయితే ఈ నిబంధనలను బీసీసీఐ అధికారిక ప్రకటించాల్సి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications