Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022 Mega Auction: కేన్‌మామ, డేవిడ్ భాయ్ మీ ఇష్టం.. మాకు కావ్య మారన్‌ కావాలి! పేలుతున్న సెటైర్స్!

IPL 2022: Twitter Trolls For Surface Of Only 4 Players Retain In IPL Mega Auction
IPL 2022 Mega Auction: Kaviya Maran ఉండాల్సిందే.. Warner, Kane లేకపోయినా పర్లే...! | Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో కొత్తగా రెండు జట్లు వచ్చి చేరేందుకు రంగం సిద్దమైంది. ఇప్పటికే ఈ ప్రక్రియను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రారంభించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు డిసెంబర్‌లో ఐపీఎల్ 2022 సీజన్ కోసం బీసీసీఐ మెగా వేలం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఒక్కో జట్టు గరిష్టంగా నలుగురు ప్లేయర్లను మాత్రమే అంటిపెట్టుకునేలా బోర్డు నిబంధన తీసుకురానుంది. ఇద్దరు ఫారిన్, మరో ఇద్దరు భారత ఆటగాళ్లు.. లేదా ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్.. ఒక ఓవర్ సీస్ ఆటగాడిని తీసుకునేలా బీసీసీఐ రిటైన్ పాలసీని రూపొందించనుందని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

సోషల్ మీడియాలో హాట్ టాపిక్..

అయితే ఈ రిటైన్ విధానంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. సెటైరికల్ ట్వీట్స్‌తో పాటు సరదా మీమ్స్ షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా రిటైన్ పాలసీ రూల్స్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రస్తుతం పటిష్టంగా ఉన్న టీమ్స్ పరిస్థితేంటని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అంతేకాకుండా ఐపీఎల్‌లోని ప్రస్తుత జట్లు ఏయే ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటాయో కూడా అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో అభిమానులు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. కొంతమంది తమ అభిప్రాయం చెబితే మరికొంతమంది దాన్ని వ్యతిరేకిస్తూ తమకు నచ్చిన ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటారని వాదిస్తున్నారు. దాంతో ఈ మెగా వేలం టాపిక్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

మాకు కావ్య మారన్ కావాలి..

కొంతమంది అభిమానులు చిలిపిగా కామెంట్ చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు. తాజా నిబంధన కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్ ముగ్గురిలో తమకు నచ్చిన వారిని తీసుకున్నా.. తీసుకోకపోయినా.. అది వాళ్ల ఇష్టమని, కానీ ఓనర్‌గా కావ్య మారన్‌ను మాత్రం రిటైన్ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మైదానంలో కావ్య పాప ఎక్స్‌ప్రెషన్స్.. నవ్వులు తమకు కావాలని.. ఆమె లేకుంటే తామెన్నో మిస్సవుతామని కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ 2021 ఫస్టాఫ్‌లో కావ్య మారన్ ప్రతీ మ్యాచ్‌కు హాజరై అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. టీమ్ ఓడిపోయిందనే బాధ కంటే కావ్య పాప బాధపడుతుందనే అభిమానులు నొచ్చుకున్నారు.

ముంబై మునిగినట్లే..

ఇక తాజా నిబంధనతో పటిష్ట ముంబై ఇండియన్స్ పని ముగిసినట్లేనని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ స్ట్రాంగ్ టీమ్‌ను తయారు చేసుకున్న ఆ ఫ్రాంచైజీపై బీసీసీఐ కోలుకోలేని దెబ్బకొట్టిందని సెటైర్లు పేల్చుతున్నారు. ఈ రూల్ గురించి విన్నాక ముంబై ఫ్రాంచైజీ బాధ వర్ణాతీతమని, కన్నీళ్లతో చెరువే నిండిపోయిందని ఫన్నీమీమ్ క్రియేట్ చేశారు. ఇక ఆదాని గ్రూప్ ఒక జట్టు కొంటే..ఫైనల్లో ఆదాని X అంబాని జట్లు తలపడితే.. చూడటానికి బాగుంటుందని మరో అభిమాని ట్వీట్ చేశాడు. ఇక ఐపీఎల్ 2021 సెకండాఫ్ కంటే మెగా వేలంపైనే సర్వత్రా ఆసక్తినెలకొంటుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.

ఫ్రాంచైజీ విలువ రూ. 2వేల కోట్లు

ఫ్రాంచైజీ విలువ రూ. 2వేల కోట్లు

ఇక కొత్త ఫ్రాంచైజీలు కొనుగోలు చేసేందుకు ప్రముఖ వ్యాపార సంస్థలు, స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఒక్కో ఫ్రాంచైజీ కనీస విలువ రూ.2000 కోట్లుగా ఉండొచ్చనేది నిపుణుల అంచనా. ఈ రెండు నయా టీమ్స్‌కు సంబంధించి టెండర్స్ ప్రక్రియను బీసీసీఐ ఆగస్టులో చేపట్టనుంది. డిసెంబర్‌లో మెగా వేలం నిర్వహించే అవకాశం ఉందని బోర్డు వర్గాలు తెలిపాయి. మీడియా హక్కుల ఒప్పందం కూడా జరగనుంది. ప్రస్తుత వివో ఒప్పందం వచ్చే ఏడాదితో ముగియనుంది. ఐపీఎల్‌ ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయేందుకు ఆస్కారం ఉంది.

Story first published: Monday, July 5, 2021, 14:07 [IST]
Other articles published on Jul 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+