
33 శాతం డ్రాప్..
కరోనా వైరస్‌తో క్లిష్ట పరిస్థితుల్లో ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహించి బీసీసీఐ సూపర్ సక్సెస్ సాధించింది. గతేడాది రెండు దశల్లో సాగిన 2021 సీజన్ అంతకంటే హెద్ద హిట్టయ్యింది. దాంతో కొత్తగా రెండు ఫ్రాంచైజీలను చేర్చి.. 10 జట్లతో ఐపీఎల్ 2022 సీజన్‌ను 74 రోజుల పాటు నిర్వహించాలని ప్లాన్ చేసిన బీసీసీఐ... అందుకు తగ్గట్టుగా వారం ముందుగానే మ్యాచ్‌లను ప్రారంభించింది. కానీ ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. గతేడాదితో పోలిస్తే టీఆర్‌పీ రేటింగ్స్ ఏకంగా 33 శాతం తగ్గిపోగా.. వ్యూయర్ షిప్ 14 శాతం పడిపోయింది.

10 జట్లతో నష్టం..
బార్క్ ఇండియా లెక్కల ప్రకారం గతేడాది తొలి వారంలో ఐపీఎల్ 2022 సీజన్ టీఆర్‌పీ రేటింగ్ 3.75గా ఉండగా.. ఈ సారి అది 2.52కి పడిపోయింది. ఆన్‌లైన్ వేదికగా వ్యూయర్‌షిప్ గతేడాది ఐపీఎల్ ప్రారంభమైన తొలి వారంలో 267.7 మిలయన్స్ వ్యూస్ రాగా.. ఈ సారి ఆ సంఖ్య 229.06 మిలియన్స్‌కు పడిపోయింది. అయితే వ్యూయర్‌షిప్, టీఆర్‌పీ రేటింగ్స్ పడిపోవడానికి అనేక కారణాలున్నాయి. దేశంలో నెలకొన్న పరిస్థితులు వ్యూయర్‌షిప్‌పై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

చప్పగా మ్యాచ్‌లు..
ఐపీఎల్ ప్రారంభానికి ముందు టోర్నీ గురించి బజ్ లేకపోవడం కూడా రేటింగ్స్‌పై ప్రభావం చూపింది. యావత్ ప్రపంచం రష్యా-ఉక్రెయిన్ యుద్దంపై ఆసక్తి కనబర్చడం, మీడియా వార్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభాన్ని జనాలు పెద్దగా గుర్తించలేకపోయారు. దానికి తోడు గతేడాది కరోనా భయానక పరిస్థితుల కారణంగా జనాలంతా ఇంట్లోనే ఉండటం.. ఇప్పుడు పరిస్థితులు కుదుటబడి ఉద్యోగాలకు వెళ్తుండటం కూడా రేటింగ్స్ తగ్గడానికి కారణమైంది. ఇక ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లన్నీ ఏకపక్షంగా జరుగుతుండటం, టాస్ గెలిచిన జట్లే గెలుస్తుండటంతో అభిమానులు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. అత్యంత ఫ్యాన్ బేస్ కలిగిన చెన్నై, ముంబై ఇండియన్స్ వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడటం కూడా వ్యూయర్‌షిప్ తగ్గడానికి కారణమైంది.


ఆర్‌ఆర్‌ఆర్ ఎఫెక్ట్..
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు రోజు(మార్చి 25న) ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో భారీ ఎత్తున విడుదలైంది. దీంతో నాలుగైదు రోజుల పాటు హైప్ అంతా ఈ సినిమా చుట్టూ తిరిగింది. సినిమాకు పాజిటీవ్ టాక్ రావడం, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల నటనతో పాటు దర్శక ధీరుడు రాజమౌళి సినిమాను రూపొందించిన విధానానికి సినీ ప్రపంచం నుంచి ప్రశంసల జల్లు కురిసింది. ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యే సాయంకాలం, రాత్రి వేళల్లో థియేటర్లు దగ్గర ఆర్‌ఆర్‌ఆర్ సినిమా టికెట్ల కోసం జనాలు క్యూ కట్టారు. ఈ సినిమా హడావుడి కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభమైన విషయమే చాలా మంది గుర్తించలేదు. ఆ ఎఫెక్ట్ టీఆర్పీపై తీవ్రంగా పడింది.


Click it and Unblock the Notifications












