For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: టాప్ 10 డేంజరస్ బ్యాట్స్‌మన్ .. అగ్రస్థానంలో ఆ ఆర్‌సీబీ ప్లేయర్!

 IPL 2022: Top 10 Most Dangerous Batsman In IPL History: AB De Villiers, Chris Gayle And 8 Others
IPL 2022 : Top 10 Most Curious Batsman In IPL History | Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ అంటేనే ధనాధన్ ఆట.! విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపించడం.! క్షణాల్లో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చేయడం.! ఇది పూర్తిగా బ్యాటర్లకే అనుకూలమైన ఫార్మాట్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గత 14 సీజన్లుగా ఈ క్యాష్ రిచ్ లీగ్ అభిమానులను అలరిస్తూనే ఉంది. కరోనాతో ఆటంకాలు ఎర్పడినా.. ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో తగ్గేదేలే అంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం 15వ సీజన్‌కు ముస్తాబువుతోంది. అయితే గత 14 ఏళ్లలో విధ్వంసకర బ్యాటింగ్ ఎంతో మంది బ్యాట్స్‌మన్ అలరించారు. మైదానం పైకప్పులను తాకే సూపర్ సిక్స్‌లతో ఆకట్టుకున్నారు. అలాంటి ఆటతో అలరించిన ఆటగాళ్ల జాబితాపై ఓ లుక్కెద్దాం.

 టాప్‌లో మిస్టర్ 360..

టాప్‌లో మిస్టర్ 360..

ఐపీఎల్ చరిత్రలో చెలరేగిన విధ్వంసకర బ్యాట్స్‌మన్ టాప్ 10 జాబితాను పరిశీలిస్తే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌కు ముందే అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఏబీ డివిలియర్స్.. కెరీర్‌లో 184 మ్యాచ్‌లు ఆడి 5,162 రన్స్ చేశాడు. యావరేజ్ 39.70గా ఉండగా.. స్ట్రైక్‌ రేట్ 151.68‌ ఉంది. రన్స్, స్ట్రైక్‌రేట్ పరంగా డేంజరస్ బ్యాట్స్‌మన్ లిస్ట్‌లో ఏబీడీ టాప్‌లో ఉన్నాడు.

ఆ తర్వాత యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ 148.96 స్ట్రైక్‌రేట్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. గేల్ 142 మ్యాచ్‌ల్లో 4965 రన్స్ చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలున్నాయి.

 టాప్-5లో కోహ్లీ, రోహిత్

టాప్-5లో కోహ్లీ, రోహిత్

ఈ జాబితాలో మూడో స్థానంలో కేఎల్ రాహుల్ ఉండగా.. నాలుగో స్థానంలో రోహిత్ శర్మ, ఐదో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ స్ట్రైక్ రేట్ 129.94 తక్కువగానే ఉన్నా.. నిలకడగా ఆడటం, ఎక్కువ పరుగులు చేసిన నేపథ్యంలో అతను ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. కేఎల్ రాహుల్ 94 మ్యాచ్‌ల్లో 3273 రన్స్ చేశాడు. యావరేజ్ 47.43గా ఉంది. ఇందులో రెండు సెంచరీలతో పాటు 27 హాఫ్ సెంచరీలున్నాయి. ఇప్పటి వరకు 213 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 130.39 స్ట్రైక్‌రేట్‌తో 5611 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ 207 మ్యాచ్‌ల్లో 6283 రన్స్ చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉండగా.. లీగ్ హయ్యెస్ట్ రన్స్ ఇవే కావడం విశేషం

డేవిడ్ వార్నర్, పొలార్డ్, ధోనీ..

డేవిడ్ వార్నర్, పొలార్డ్, ధోనీ..

ఇక డేవిడ్ వార్నర్ 150 మ్యాచ్‌ల్లో 139.96 స్ట్రైక్‌రేట్‌తో 5449 పరుగులు చేసిన వార్నర్.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. అతను లీగ్‌లో 50 హాఫ్ సెంచరీలతో పాటు 4 సెంచరీలు బాదాడు. వార్నర్ తర్వాత కీరన్ పొలార్డ్ 149.77 స్ట్రైక్‌రేట్‌తో కీరన్ పొలార్డ్ ఉన్నాడు. అతను 178 మ్యాచ్‌ల్లో 3268 రన్స్ చేశాడు. ఇక ఐపీఎల్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 135.83 స్ట్రైక్ రేట్‌తో 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. ధోనీ ఇప్పటి వరకు 217 మ్యాచ్‌ల్లో 4715 రన్స్ చేశాడు.

మ్యాడ్ మ్యాక్సీ, రస్సెల్...

మ్యాడ్ మ్యాక్సీ, రస్సెల్...

ఆస్ట్రేలియా విధ్వంసకర క్రికెటర్, ఆర్‌సీబీ హిట్టర్ మ్యాక్స్‌వెల్ 97 మ్యాచ్‌ల్లో 2018 రన్స్‌తో పాటు 151.48 స్ట్రైక్‌రేట్‌తో ఈ హిట్టర్స్ జాబితాలో 9వ స్థానంలో నిలిచాడు. ఇక విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రస్సెల్ ఏకంగా 178.57 స్ట్రైక్‌రేట్.. 1700 రన్స్‌తో పదో స్థానంలో నిలిచాడు. 84 మ్యాచ్‌ల్లో రస్సెల్ ఈ పరుగులు చేశాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా(153.91 స్ట్రైక్ రేట్), సురేశ్ రైనా(137.14), షేన్ వాట్సన్(137.91), వీరేంద్ర సెహ్వాగ్(155.44), జానీ బెయిర్ స్టో(142.19)తో టాప్ 15‌లో కొనసాగుతున్నారు.

Story first published: Tuesday, February 8, 2022, 15:48 [IST]
Other articles published on Feb 8, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+