
సుందర్ కీలకం..
ఇక మ్యాచ్ అనంతరం తమ ఘోర ఓటమిపై స్పందించిన టామ్ మూడీ.. సుందర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. తదుపరి మ్యాచ్‌ల్లో అతను అప్‌ది ఆర్డర్ కూడా ఆడే అవకాశం ఉందన్నాడు. 'వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ఆల్‌రౌండర్ అని గుర్తించే మెగా వేలంలో కొనుగోలు చేశాం. అందుకే చెబుతున్నా వచ్చే మ్యాచుల్లో బ్యాటింగ్, బౌలింగ్‌పరంగా సుందర్ కీలక పాత్ర పోషిస్తాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో దిగిన ఎనిమిదో స్థానం సుందర్‌కు శాశ్వతం కాదు. ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉంటాడు'అని తెలిపాడు. 'నో బాల్స్' వేయడంపైనా ఘాటుగా స్పందించాడు. ఆటలో 'నో బాల్స్' వేయడం ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశాడు.

ఆశావహ దృక్పథంతో ఉండాలి
క్లిష్ట సమయాల్లో హుషారుగా, ఆశావహ దృక్పథంతో ఉండాలని కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన సహచరులకు సూచించాడు. 'చాలా బాగానే ఆరంభించాం. అయితే తొలుత స్పందించిన పిచ్ తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. దీంతో ప్రత్యర్థి జట్టను ఆపడం కష్టమైంది. అయితే మా జట్టులోనూ ఎన్నో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. టీ20 గేమ్ అంటేనే ఇలా ఉంటుంది. అపజయాలను మరిచి సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. తర్వాతి ఆటకు చాలా రోజుల సమయం ఉంది కాబట్టి.. సరిదిద్దుకోవాల్సిన అంశాలపై మాట్లాడుకుంటాం. పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాం' అని కేన్ పేర్కొన్నాడు.

చెలరేగిన రాజస్థాన్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజూ శాంసన్(27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 55), దేవదత్ పడిక్కల్(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) విధ్వంసం సృష్టించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్ రెండేసి వికెట్లు తీయగా.. భువీ, రోమియో తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్(41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(14 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), రొమారియో(18 బంతుల్లో 2 సిక్స్‌లతో 24)మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.


Click it and Unblock the Notifications












