Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022 Tickets కావాలా మామా? ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలంటే?

 IPL 2022 Tickets booking online to start soon, Check How to buy

ముంబై: ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 సీజన్‌కు మరో 10 రోజుల్లో తెరలేవనుంది. భారత్ వేదికగానే ఈ క్యాష్ రిచ్ లీగ్ జరుగుతున్నా.. కరోనా కారణంగా ఈ సారి లీగ్‌ను ముంబై, పుణేలకే పరిమితం చేశారు. ముంబైలోని వాంఖడే స్టేడియం, డీవై పాటిల్ స్టేడియం, పుణేలోని ఎంసీఏ మైదానాల్లోనే లీగ్ మొత్తం జరగనుంది. ఫైనల్‌తో పాటు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లను మాత్రం అహ్మదాబాద్ వేదికగా నిర్వహించనున్నారు.

ఇక ఈ నెల 26 నుంచి మే 29 వరకు ఈ లీగ్ అభిమానులను అలరించనుంది. ఈ సారి కొత్తగా రెండు జట్లు వచ్చి చేరడంతో మొత్తం పది జట్లతో మ్యాచ్‌ల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఈ మ్యాచ్‌లకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతివ్వనున్నారు. తొలుత ఖాళీ మైదానాల్లో నిర్వహించాలని భావించినా.. ప్రస్తుతం భారత్‌లో కరోనా పరిస్థితులు అదుపులో ఉండటంతో 25 శాతం ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించారు.

దాదాపు రెండేళ తర్వాత ప్రేక్షకులను అనుమతిస్తుండటం, పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉండటంతో టికెట్లకు భారీ డిమాండ్ ఉండనుంది. అతి త్వరలోనే ఐపీఎల్ అఫిషియల్ వెబ్‌సైట్‌ www.iplt20.comలో టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు.

టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలంటే..?

స్టెప్ 1: అఫిషియల్ వెబ్‌సైట్ www.iplt20.comలోకి వెళ్లాలి.

స్టెప్ 2: మెనూ బార్‌లోని బై టికెట్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

స్టెప్ 3: కావాల్సిన మ్యాచ్ టికెట్లను ఎంచుకొని కావాల్సిన వివరాలు నమోదు చేయాలి.

స్టెప్ 4: ఎన్ని టికెట్లు కావాలో వాటికి తగ్గ ధరను ఆన్‌లైన్ పేమెంట్ మోడ్‌లోనే చెల్లించాలి.

స్టెప్ 5: పేమెంట్ పూర్తయిన తర్వాత టికెట్స్‌కు సంబంధించిన పీడీఎఫ్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

IPL 2022: 26 Overseas Star Players To Miss First Week Of IPL, Here's The List | Oneindia Telugu

స్టెప్ 6: ఆ డౌన్‌లోడ్ చేసుకున్న ఫైల్‌కు సబంధించిన స్క్రీన్ షాట్ లేదా ప్రింటౌట్‌ను మ్యాచ్‌కు తీసుకెళ్లాలి. మ్యాచ్‌లకు వెళ్లాలంటే రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి.

Story first published: Wednesday, March 16, 2022, 19:51 [IST]
Other articles published on Mar 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+