Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: అరుదైన ఘటన.. వికెట్ కీపర్ అత్యుత్సాహం! నోబాల్ ఇచ్చిన అంపైర్! కోహ్లీ వాగ్వాదం!

IPL 2022: Third umpire Gives no ball After Anuj Rawat collected the ball from in front of the stumps
IPL 2022: MS Dhoni’s gesture towards youngster Mukesh Choudhary wins heart| Oneindia News

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. బౌలర్ తప్పిదం లేకుండానే ఓ బంతిని థర్డ్ అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. వికెట్ల వెనుకాల వికెట్ కీపర్ అత్యుత్సాహం కారణంగా థర్డ్ అంపైర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయంపై ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంపైర్లతో వాదించాడు. సహజంగా బౌలర్ లైన్ ధాటి బౌలింగ్ వేసినప్పుడు లేదా? బ్యాటర్ పొట్ట భాగం కన్నా పైకి వేసినప్పుడు, ఫీల్డింగ్ రూల్స్ అతిక్రమించినప్పుడు అంపైర్లు నోబాల్ ఇవ్వడం చూస్తుంటాం. అయితే వికెట్ కీపర్ తప్పిదం కారణంగా నోబాల్ ఇవ్వడం అత్యంత అరుదు.

అసలేం జరిగిందంటే..?

గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ సందర్భంగా షెహ్‌‌బాజ్ అహ్మద్ వేసిన 9 ఓవర్ నాలుగో బంతిని శుభ్‌మన్ గిల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అంచనా వేయడంలో విఫలమవడంతో కీపర్ చేతిలో పడింది. క్యాచ్ కోసం వికెట్ కీపర్ అనూజ్ రావత్ అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. బ్యాట్‌కు తాకలేదనే ఆత్మవిశ్వాసంతో వెంటనే గిల్ రివ్యూ కోరాడు. అల్ట్రా ఎడ్జ్‌లో బ్యాట్‌కు తాకలేదని తేల్చిన థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సవరించాడు. అంతేకాకుండా వికెట్ కీపర్ స్టంప్స్‌కు ముందే బంతిని అందుకున్నాడని గుర్తించి నోబాల్ ప్రకటించాడు. ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన విరాట్.. అంపైర్‌తో వాదించాడు. కానీ అంపైర్లు నిబంధనలు చెప్పడంతో సైలెంట్ అయ్యాడు.

అసలు ఈ రూల్ ఉందా?

అయితే వికెట్ కీపర్ తప్పిదం కారణంగా నోబాల్ ఇస్తారనే విషయం తమకు తెలియదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తొలిసారి ఇలాంటి ఘటనను చూస్తున్నామని, గతంలో చాలా మంది వికెట్ కీపర్లు వికెట్ల కన్నా ముందే బంతిని అందుకొని స్టంపౌట్స్ చేశారని గుర్తు చేస్తున్నారు. ఇక మైదానంలోని వేడి కారణంగా ఆర్‌సీబీ రెగ్యూలర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అస్వస్థతకు గురవ్వడంతో అనూజ్ రావత్ మైదానంలోకి దిగాడు.

చెలరేగిన కోహ్లీ, పటిదార్..

చెలరేగిన కోహ్లీ, పటిదార్..

విరాట్ కోహ్లీ(53 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 58), రజత్ పటిదార్(32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో ఆర్‌సీబీ ప్రత్యర్థి ముందు 171 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ ఇద్దరికి తోడుగా గ్లేన్ మ్యాక్స్‌వెల్(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) మెరుపులు మెరిపించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రదీప్ సంగ్వాన్ 2 వికెట్లు తీయగా.. షమీ, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్, ఫెర్గూసన్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధరకు దిగిన గుజరాత్ 13 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది.

Story first published: Saturday, April 30, 2022, 19:01 [IST]
Other articles published on Apr 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+